Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరు నీటి సంక్షోభం.. రేపు ఎక్కడైనా రావచ్చన్న చిరంజీవి ట్వీట్ వైరల్!!

నీటి సంక్షోభంతో బెంగళూరు విలవిలలాడుతుంది. ఇటు బెంగళూరులోనే కాదు ఎక్కడైనా నీటి సమస్య రావచ్చని, నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. చిరంజీవి చేసిన ఒక సుదీర్ఘమైన ట్వీట్ లో ఇప్పుడు బెంగళూరులో నీటి కష్టాల గురించి అందరికీ తెలిసిందేనన్నారు.

నీటి కష్టాలు రాకుండా ఉండడానికి బెంగళూరులో ఫామ్ హౌస్ లో తను చేసిన చిన్న చిన్న చర్యలు ఎంతగానో తోడ్పడుతున్నాయి అని చెప్పుకొచ్చారు. మనందరికీ తెలిసినట్టుగా నీరు అత్యంత విలువైనదని పేర్కొన్న చిరంజీవి నీటి కొరత మన రోజువారి జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని, నేడు బెంగళూరులో ఏర్పడిన నీటి కొరత రేపు ఎక్కడైనా ఏర్పడవచ్చు అన్నారు.

Bengaluru water crisis Chiranjeevi tweet on water conservation goes viral

కాబట్టి నీటి సంరక్షణకు సహాయపడే ఇళ్ళను నిర్మించాల్సిన అవసరాన్ని కానీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను అని పేర్కొన్న చిరంజీవి, బెంగళూరులోని తన ఫామ్ హౌస్ లో నీటి సంరక్షణ కోసం తాను చేసిన వాటిని గురించి తెలిపారు. తాను నిర్మించుకున్న ఫామ్ హౌస్ సైట్ అంతటా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

అంతేకాదు ప్రతి రీఛార్జ్ బావి లోను వడపోత వ్యవస్థ ఉంటుందని, రీఛార్జ్ బావి రీఛార్జ్ పిట్ తో పోలిస్తే ఎక్కువ నీటిని నిలువ చేస్తుందని తెలిపారు. తాను పర్యావరణాన్ని కాపాడడానికి పెర్మాకల్చర్ సూత్రాలను కూడా అమలు చేశానని, తద్వారా నీటిని సంరక్షించ వచ్చునని, వర్షపునీటిని ఒడిసి పట్టవచ్చునని చిరంజీవి పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల గృహాలను నిర్మించుకుంటే నీటి కొరత తీరుతుందని, భవిష్యత్తు తరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చిరంజీవి తెలిపారు.

బెంగళూరు నీటి సంక్షోభం చూసిన తర్వాత అయినా ప్రజలకు నీటి సంరక్షణ పైన అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో తాను నిర్మించుకున్న పర్యావరణ అనుకూల గృహానికి సంబంధించి, నీటి సంరక్షణకు చేపట్టిన అనేక విధానాలను చిరంజీవి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కన్నడలో చేసిన ఈ ట్వీట్ లో నీటి సంరక్షణకు సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+