అజీమ్ ప్రేమ్‌జీ ఓకే అంటే బెంగళూరు విప్రో క్యాంపస్ గుండా ట్రాఫిక్

మొన్నటికి మొన్న.. బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు, అధ్వానంగా మారిన రోడ్ల కారణంగా జెయింట్ లాజిస్టిక్ కంపెనీ బ్లాక్ బక్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తొమ్మిది సంవత్సరాలుగా బెల్లందూరు అవుటర్ రింగ్ రోడ్డులో గల ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది. మరో ప్రాంతానికి రీలొకేట్ కానుంది. రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోండటం, రోడ్లు అత్యంత దయనీయంగా మారడం, ఆఫీస్ కు వెళ్లడానికి ఉద్యోగులకు గంటన్నరకు పైగా సమయం పడుతోండటం వల్ల ఈ నిర్ణయానికొచ్చింది.

ఈ పరిస్థితుల మధ్య.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రంగంలోకి దిగారు. అవుటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ ను రెగ్యలరేట్ చేయడానికి చర్యలు తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా- విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి లేఖ రాశారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR)లోని ఇబ్బలూరు జంక్షన్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి క్యాంపస్ గుండా వాహన రాకపోకలకు అనుమతివ్వాలని కోరారు. విప్రో క్యాంపస్ ద్వారా పరిమితంగా వాహన రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Bengaluru s Traffic Troubles Siddaramaiah Reaches Out to Wipro s Azim Premji

దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని, పీక్ అవర్స్‌లో రద్దీని తగ్గించవచ్చని సిద్ధరామయ్య తెలిపారు. పరస్పర అంగీకారంతో కూడిన నిబంధనలు, భద్రతాపరమైన అంశాలకు లోబడి విప్రో క్యాంపస్ గుండా వాహనాల రాకపోకలకు అనుమతించే అవకాశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. ట్రాఫిక్, అర్బన్ మొబిలిటీ నిపుణుల ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ చర్య ORR లోని ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో రద్దీని దాదాపు 30 శాతం తగ్గించగలదని లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యంగా కార్యాలయ పనివేళల్లో ఈ తగ్గింపు ప్రభావం ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు. ఈ పరిణామం బెంగళూరులో ప్రయాణికులు, ఉద్యోగుల సమయాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించడానికి కొంత మేర వెసలుబాటటు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నగరాన్ని మరింత సమర్థవంతంగా వాహనాల రాకపోకలను నిర్వహించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులతో కలిసి పని చేయాలని విప్రో యాజమాన్యాన్ని కోరారు.

పీక్ అవర్స్‌లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రయాణ సౌలభ్యం, ఉత్పాదకత, పట్టణ జీవన నాణ్యత దెబ్బతింటున్నాయని సిద్ధరామయ్య అంగీకరించారు. బ్లాక్‌బక్ సీఈఓ రాజేష్ యాబాజీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ లో వాహనాల రాకపోకలపై నివేదిక తెప్పించుకున్నారు. గత ఏడాదితో ఈ సంవత్సరం జూన్ 2025లో ఔటర్ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ 45 శాతం పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+