భర్త చనిపోయిన వారానికే భార్య ఆత్మహత్య - కథలో బిగ్ ట్విస్ట్..!!
ఒంటరి మహిళలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. మహిళ ఒంటరిగా ఉందని తెలిస్తే చాలు కామాంధులు వావి వరసలు మరిచి మృగాళ్లలా తయారవుతున్నారు. వేధింపులకు గురిచేసి వారిని లొంగదీసుకుంటున్నారు. స్నేహితులు లేదా ఒకే చోట పనిచేసే వారే ఒకరికి తెలియకుండా మరొకరి భార్యలను వేధించిన ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కర్ణాటకలోని భద్రావతి తాలూకా, హోసా సిద్ధాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భర్త ఆత్మహత్య చేసుకున్న ఆరు రోజులకే భార్య స్వాతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఆమె రాసిన లేఖతో ఈ కేసులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.కర్ణాటక రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ జగదీష్ ఫిబ్రవరి 14న ఆత్మహత్య చేసుకున్నారు. మద్యం అలవాటుతో కుటుంబంతో తరుచూ గొడవపడి, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. కొన్ని రోజులు బెదిరింపులకు పాల్పడిన భర్త చివరికి తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

భర్త మరణంతో స్వాతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఇదే సమయంలో, కానిస్టేబుల్ మోహన్ ఆమెపై కన్నేశాడు. భర్త ఎలాగూ లేడని భావించిన మోహన్ ఆమెన వశపర్చుకోవాలని భావించాడు. సోషల్ మీడియా ద్వారా స్వాతికి అసభ్య సందేశాలు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి. మోహన్ అరాచాకాలు ఎక్కవవుతుండటంతో స్వాతి అతడిని బ్లాక్ చేసింది. స్వాతి బ్లాక్ చేయడంతో మోహన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. స్వాతిపై దుష్ప్రచారం చేస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. స్వాతి ఈ విషయాలు తల్లి భాగ్యమ్మకు చెప్పగా, 13వ రోజు తన భర్త పెద్దకర్మ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమె సూచించింది.
అయినప్పటికీ, ఫిబ్రవరి 20న స్వాతి తల్లికి వాట్సాప్‌లో మెసేజ్ పంపి తనకు ఎదురవుతున్నా మానసిక వేధింపులను వివరించింది. తన ఆత్మహత్యకు మోహనే కారణమని ఆరోపిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మెసేజ్ పంపిన కొద్ది నిమిషాలకే, స్వాతి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.స్వాతి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో, భద్రావతి న్యూ టౌన్ పోలీసులు కానిస్టేబుల్ మోహన్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపణ, పరువు నష్టం, బెదిరించి డబ్బులు వసూలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అతడిపై కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొని మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయిన మోహన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.స్వాతిది భద్రావతి తాలూకాలోని కోణిబిడు గ్రామం కాగా, జగదీష్ శివమొగ్గలో రిజర్వ్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.












Click it and Unblock the Notifications