వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్వేష రాజకీయాలకే రాజీవ్ బలి-రాహుల్ ట్వీట్- శ్రీపెరంబుదూర్ లో తండ్రికి నివాళులు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఇవాళ భారత్ జోడో యాత్రను ప్రారంభించబోతున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే 3500 కిలోమీటర్ల పొడవైన ఈ యాత్ర 150 రోజుల పాటు 12 రాష్ట్రాల్లో కొనసాగబోతోంది. ఈ యాత్రకు ముందు తమిళనాడులో తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన శ్రీపెరంబుదూర్ లో ఏర్పాటు చేసిన స్మారకం వద్ద రాహుల్ నివాళులు అర్పించారు.

భారత్ జోడో యాత్ర కోసం నిన్న రాత్రే చెన్నైకు చేరుకున్న రాహుల్ గాంధీ.. ఇవాళ ఉదయం తండ్రి రాజీవ్ స్మారకం
వద్దకు చేరుకుని కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
విద్వేషం, విభజన రాజకీయాలకు తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని కోల్పోయానని, దాని వల్ల తన ప్రియమైన దేశాన్ని కూడా కోల్పోనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. కలిసి, మేము అధిగమిస్తామమంటూ ఈ ట్వీట్ లో రాహుల్ పేర్కొన్నారు.

Bharat Jodo Yatra : rahul gandhi tributes to rajiv gandhi, says hate politics killed him

రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం తమిళనాడు, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ సీఎంలు ఎంకే స్టాలిన్, అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకం చేతబూని భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. రేపటి నుంచి ఈ యాత్ర రెగ్యులర్ గా కొనసాగుతుంది. 3,570 కి.మీ.ల 'భారత్ జోడో యాత్ర' తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమై, తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌసా మీదుగా ఉత్తర దిశగా సాగుతుంది. అల్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్ మరియు జమ్మూ, శ్రీనగర్‌లో ముగుస్తుంది.

కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రను స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్ద ప్రజా సంప్రదింపు కార్యక్రమంగా, భారతదేశ రాజకీయ చరిత్రలో "మలుపు"గా అభివర్ణిస్తోంది. ఈ యాత్ర ఉదయం 7 నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 6:30 వరకూ కొనసాగుతుంది. ఉదయం సెషన్‌లో తక్కువ మంది పాల్గొనేవారు ఉండగా, సాయంత్రం సెషన్‌లో జన సమీకరణ కనిపిస్తుంది. ప్రతిరోజూ 22 నుండి 23 కి.మీ.ఈ యాత్ర కొనసాగనుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాగే తమ 'భారత్ జోడో యాత్ర' 'మన్ కీ బాత్' కాదని, ప్రజల ఆందోళనలు, డిమాండ్‌లు ఢిల్లీకి చేరేలా చూడడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ పదేపదే చెబుతోంది.

English summary
congress mp rahul gandhi said that his late father rajiv gandhi assasined due to hate politis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X