భారత్ బంద్ - ఏపీ ప్రభుత్వం మద్దతు : బస్సులు-స్కూళ్లు నిలిపివేత : రోడ్లపైకి విపక్ష నేతలు..!!
దేశ వ్యాప్తంగా భారత్ బంద్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగనుంది. ఏపీలో బీజేపీ - జనసేన మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్‌మోర్చా తలపెట్టిన భారత్ బంద్‌కు ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఏపీ ప్రభుత్వం సైతం బంద్ కు సంఘీభావం తెలిపింది. అందులో భాగంగా..మధ్నాహ్నం వరకు బస్సులను నిలిపివేస్తూ నిర్ణయించింది.

బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు
పాఠశాలలు సైతం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్నాహ్నం ఒంటి గంట తరువాత తిరిగి బస్సులు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ తో పాటుగా టీడీపీ - వామపక్ష పార్టీలు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొననున్నాయి. ఇక, తెలంగాణలో ప్రభుత్వం నుంచి బంద్ పైన అధికారిక ప్రకటన లేదు. కాంగ్రెస్ - వామపక్షాలు మాత్రం సయుక్తంగా బంద్ సక్సెస్ చేసేందుకు రంగంలోకి దిగాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొననున్నారు. ఏపీలో కొన్ని జిల్లాల్లో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాలను వాయిదా వేశారు.

బీజేపీ-టీఆర్ఎస్-జనసేన మినహా
బంద్‌కు వైకాపా సంఘీభావం ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. తమ పార్టీ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. సీపీఎం, సీపీఐ సహా అన్ని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ బంద్‌లో పాల్గొననున్నాయి. ఇక, జాతీయ స్థాయిలోనూ బంద్ సక్సెస్ చేసేందుకు..రైతులకు మద్దతు బీజేపీ వ్యతిరేక పార్టీలన్న ముందుకు వచ్చాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన భారత్ బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, బీఎస్పీ తెలిపాయి.

మరో పదేళ్లపాటు అయినా కొనసాగిస్తామంటూ
10 నెలలుగా ఉద్యమిస్తున్న తాము అవసరమైతే పదేళ్లపాటు దాన్ని కొనసాగించడానికి సిద్ధమేగానీ, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమలు కానిచ్చేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు. ట్రాక్టర్లను సిద్ధం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.ఇప్పటివరకు 11 విడతలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బంద్‌కు ఎస్‌కేఎం ఏర్పాట్లు చేసింది.

బందోబస్తు ముమ్మరం
బంద్ పిలుపు నేపథ్యంలో దిల్లీలో పోలీసు బందోబస్తు ముమ్మరం చేశారు. ఇండియా గేట్, విజయ్‌చౌక్ సహా ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించారు. నిరసన శిబిరాల నుంచి ఎవరూ దేశ రాజధానిలోకి రాకుండా చర్యలు చేపట్టారు. దిల్లీలోకి వచ్చే ప్రతి వాహనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఉదయం 6నుంచి సాయంత్రం 4గంటల వరకు బంద్ పాటిస్తామని, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని ఎస్‌కేఎం తెలిపింది.
Recommended Video

రోడ్ల పైకి కాంగ్రెస్ - వామపక్ష పార్టీల నేతలు
దీంతో..బంద్ సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ - వామపక్షాలతో పాటుగా మద్దతిస్తున్న పార్టీల నేతలు రోడ్ల పైకి వస్తున్నారు. బస్సులను డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో బంద్ కు మద్దతుగా వామపక్షాల ర్యాలీ కొనసాగనుంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బస్సులు యధావిధిగా నడుస్తాయని..ఇతర రాష్ట్రాలకు వెళ్లేవి సైతం నడుపుతామని ప్రకటించింది. ఢిల్లీ - అంబాలా రైల్వే లైను బ్లాక్ చేయటానికి అదే విధంగా జాతీయ రహదారి 44 పైన రాకపోకలను నిలిపివేయాలని సంయుక్త్ కిసాన్ మోర్చా నిర్ణయించింది.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications