లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒడిశాలోని కటక్ నుంచి ఏడుసార్లు విజయం సాధించారు మహతాబ్. స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు.

18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ మహతాబ్ ప్రమాణం చేయిస్తారని.. ఆయనకు కే సురేష్ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే)తోపాటు రాధా మోహన్ సింగ్(బీజేపీ), ఫగ్గన్ సింగ్ కులస్తే (బీజేపీ), సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ) చైర్ పర్సన్‌ల ప్యానెల్ సహాయంగా ఉంటుందని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

Bhartruhari Mahtab as Lok Sabha Protem Speaker

కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందే బిజు జనతా దళ్ ను వీడిన భర్తృహరి మహతాబ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కటక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏడోసారి ఘన విజయం సాధించారు. ఇక, 18వ లోక్‌సభ సమావేశాలు జూన్ 24 నుంచిప్రారంభం కానున్నాయి.

జూన్ 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. జూన్ 26న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. జూన్ 27న లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. రాబోయే ఐదేళ్లలో కొత్త ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలను వివరించనున్నారు.

కాగా, భర్తృహరి మహతాబ్, సెప్టెంబర్ 8, 1957న జన్మించారు. 'ఉత్కల్ కేసరి'గా ప్రసిద్ధి చెందిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ కుమారుడు. భర్తిహరి మహతాబ్ 2017లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, సంసద్ రత్న అవార్డులతో కూడా సత్కారం పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+