Rakesh Jhunjhunwala: గుండెలు పిండేసే చివరి వీడియో
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం, ఇండియన్ వారెన్ బఫెట్‌గా గుర్తింపు పొందిన బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా, ముగ్గురు పిల్లలు నిష్ఠ, ఆర్యమాన్, ఆర్యవీర్ ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 4,61,85,40,00,000 రూపాయలు. ఇందులో చాలావరకు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సంపాదించినదే.
Recommended Video

కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. అది తీవ్రం కావడం వల్ల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఆయన పేరు తెలియని వారుండరు. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయ్యే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ల భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆయన ముందుగానే తేల్చేస్తారు. 99 శాతం ఆయన అంచనాలు తప్పవు అనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో నెలకొని ఉంది.
I don't want to remember this day as a sad day
— Keshav Arora (@CommerceGuruu) August 14, 2022
Yes, RJ passed away but this will clip will always be there in my heart which shows how happy he was. pic.twitter.com/jpaOhFrLvN
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మృతిపట్ల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, వివిధ ట్రేడింగ్ కంపెనీల డైరెక్టర్లు, నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు. స్మృతి ఇరానీ సహా పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

కాగా- రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనారోగ్యంతో బాధపడుతూ వీల్ ఛైర్‌లో కూర్చుని ఉన్న వీడియో అది. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కజ్రారె.. పాటకు ఆయన వీల్‌ఛైర్‌లో కూర్చునే డాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. తన శాలువను దుపట్టాగా ధరించి ఆయన ఆ పాటకు డాన్స్ చేశారు. తోటి బంధువులు, మిత్రులతో ఉల్లాసంగా గడపడం ఈ వీడియోలో రికార్డయింది. అంతా సవ్యంగా ఉందనుకుంటోన్న దశలోనే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణించడాన్ని వారు జీర్ణించుకోవట్లేదు.












Click it and Unblock the Notifications