Hyderabad: 'దేశ రాజధానిగా హైదరాబాద్'పై హాట్ డిబేట్.. MP శశి థరూర్ పోస్ట్‌తో రాజుకున్న క్యాపిటల్ చిచ్చు
National Capital: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అత్యంత తీవ్ర స్థాయికి పెరిగిపోవడంతో అనేక కొత్త ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 500 మార్కును తాకడంతో ఇంటర్నేషనల్ లెవల్‌లో ఢిల్లీ పేరు మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ MP శసి థరూర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
'ఢిల్లీ ఇప్పటికీ భారతదేశ జాతీయ రాజధానిగా ఉండేందుకు తగినదేనా' అని కాంగ్రెస్ MP శశి థరూర్ ప్రశ్నించారు. ఆయన Xలో చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు హైదరాబాద్ లేదా చెన్నెైవంటి దక్షిణాది నగరాల్లో ఒకదానికి మారిస్తే బావుంటుందని సూచించారు. అయితే ఇటువంటి డిబేట్ జరగడం ఇది కొత్తేమీ కాదు.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దీనిపై అనేకసార్లు చర్చలు జరిగాయి. అయితే వాటిలో ముందుగా వినిపించే పేరు హైదరాబాద్. అప్పట్లోనే రాజ్యాంగ నిర్మాత దీనిపై సూత్రప్రాయంగా సూచించారు కూడా. సముద్ర తీరానికి దూరంగా, నిలకడ కలిగిన వాతావరణంతో కూడిన భాగ్యనగరం భద్రతా పరంగాను కీలక ఎంపికగా మారింది. అయితే స్థానికంగా రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ హైదరాబాద్ జాతీయ రాజధానిగా మారితే కేంద్రం కనుసన్నల్లోనే నడుచుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ విషయాన్ని పక్కనపెడితే శశి థరూర్ తన పోస్టులో నవంబర్ నుంచి జనవరి మధ్య ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో నివాసయోగ్యం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీ ఇప్పుడు అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరం. 4 రెట్లు ప్రమాదకర స్థాయిలతో పాటు రెండవ స్థానంలో ఉన్న కాలుష్యమయ నగరం ఢాకా కంటే దాదాపు 5 రెట్లు అధ్వాన్నంగా ఉంది' అని థరూర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కొన్ని రోజుల ముందు ఆయన ఈ పోస్ట్ చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications