మహారాష్ట్రలో మళ్లీ ఏకమైన థాక్రే బ్రదర్స్..! బీజేపీ ఆ ఒక్క తప్పిదంతో ?
మహారాష్ట్ర రాజకీయాల్ని ఒకప్పుడు శాసించిన బాల్ థాక్రే వారసులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే అనంతరం వారసత్వం విషయంలో వచ్చిన వివాదంతో దూరమయ్యారు. దశాబ్దాల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ వారు ఏకమవుతున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నాయకులు ఇవాళ కీలక ప్రకటనలు చేశారు. ఓ కీలక అంశంలో వీరిద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్దం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అధికార బీజేపీ కూటమికి షాకిచ్చింది.
మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని బలవంతంగా అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మరాఠావాదులైన థాక్రేలకు మంటపుట్టించింది. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే గళం విప్పుతున్న కజిన్స్ ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే ఇప్పుడు దీనిపై కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

త్వరలో మహారాష్ట్రలో బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో థాక్రే సోదరులు తిరిగి కలిసిపోవడం కచ్చితంగా బీజేపీ లెక్కల్ని తారుమారు చేసే అవకాశముంది. అలాగే బీజేపీతో జట్టుకట్టి శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే వర్గంపై ఉద్ధవ్ ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదో మంచి ఛాన్స్ గా మారబోతోంది. దీంతో కజిన్ రాజ్ థాక్రేను కలుపుకుని హిందీ అజెండాతో ఈ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు ఉద్ధవ్ ప్లాన్ చేసుకుంటున్నారు.
महाराष्ट्रतील शाळांत हिंदी सक्ती विरोधात एकच आणि एकत्र मोर्चा निघेल!
— Sanjay Raut (@rautsanjay61) June 27, 2025
जय महाराष्ट्र! pic.twitter.com/A8ATq2ra0k
మహారాష్ట్ర స్కూళ్లలో హిందీ భాషను తప్పనిసరిగా అమలు చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే రాజ్ థాక్రే నేతృత్వలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన జూలై 5న ఆందోళనలకు పిలుపునిచ్చింది. అలాగే ఉద్ధవ్ థాక్రే శివసేన వర్గం జూలై 7న ఇదే అజెండాతో నిరసనలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసిపోవడంతో రాజ్ థాక్రే పిలుపునిచ్చిన జూలై5నే సోదరులిద్దరూ కలిసి ఈ ఆందోళనల్ని నిర్వహిస్తారని సంజయ్ రౌత్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications