Arvind Kejriwal కు బిగ్ రిలీఫ్; మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు .. ఎప్పటివరకు అంటే
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఏడు దశల లోక్సభ ఎన్నికల ఓటింగ్ చివరిదశ అయిన జూన్ ఒకటవ తేదీ వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ రిలీఫ్
దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఎన్నికల సమయంలో బిగ్ రిలీఫ్ ను ఫీల్ అవుతున్నారు. ఈడీ తన అరెస్ట్ ను సవాల్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తరపున వాదిస్తూ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే, ఏడవ మరియు చివరి దశ ప్రచారాన్ని ఓటింగ్ వేసే 48 గంటల ముందే ఆపివేస్తారని, దీంతో కోర్టు జూన్ నాలుగు వరకు బెయిల్ కుదరదని పేర్కొంది.

కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీం లో వాదనలు
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ముందు ప్రచారానికి ఢిల్లీ ముఖ్యమంత్రిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేపధ్యంలో ఆయనకు బెయిల్ కావాలని కోరింది కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల బృందం. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఈడీ గురువారం తన అభ్యంతరాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఎన్నికల ప్రచారానికి జైల్లో ఉన్న వారిని పంపటం మంచిది కాదు: ఈడీ
ఎన్నికల ప్రచారం కోసం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ అడిగే "ప్రాథమిక" హక్కు ఏదీ లేదని ఈడీ వాదించింది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్న ఎవరికీ, ప్రచారం కోసం బెయిల్ మంజూరు చేయలేదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్‌ను జైలు నుండి తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు పంపటం తప్పుడు సంకేతాలను ఇస్తుందని ఈడీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
తీహార్ జైల్లో ఉంటూ బెయిల్ కోసం కోర్టులో పోరాటం చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉంటూ బెయిల్ కోసం కోర్టులో పోరాటం చేస్తున్నారు.తనను కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications