ఉన్నావ్ అత్యాచారం కేసు.. కుల్దీప్ సెంగర్ కు బిగ్ షాకిచ్చిన హైకోర్టు
ఉన్నావ్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి కస్టడీలో మృతి చెందాడు. ఈ కేసులో బీజేపీ సస్పెండెడ్ లీడర్ కుల్దీప్ సింగ్ సెంగర్ కు దిల్లీ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఈ కేసులో తనకు విధించిన 10 ఏళ్ల శిక్షను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను దిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. ఈ మేరకు శిక్ష నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు సరైన కారణాలను తెలపలేదని జస్టిస్ రవీందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు తదుపరి విచారణను ఫిబ్రవరి 3 వ తేదీకి వాయిదా వేశారు.
2017 ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి కస్టడీ మృతి కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో తనకు విధించిన 10 ఏళ్ల శిక్షను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ శిక్ష వ్యవహారంలో కుల్దీప్ కు ఊరట కల్పించేందుకు సరైన కారణాలు లేవని జస్టిస్ రవీందర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేశారు.
ఇక ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సెంగర్ దోషిగా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే ఉన్నావ్ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్ కు విధించిన జీవిత ఖైదు శిక్షను నిలిపివేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఇటీవల స్టే విధించింది. సీబీఐ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలంటూ ఈ మేరకు సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సెంగార్ ను కస్టడీలోనే ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

2017 లో కుల్దీప్ సింగ్ సెంగార్ యూపీలోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన మైనర్ ను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 ఏప్రిల్ లో ఆమె తండ్రి పోలీస్ కస్టడీలో ఉండగా మృతి చెందాడు. ఈ క్రమంలో 2019 ఆగస్టు 1 న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, ఇతర కేసులను యూపీలోని ట్రయల్ కోర్టు నుంచి దిల్లీకి ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే నేరం రుజువు కావడంతో అత్యాచారం కేసులో జీవిత ఖైదు, తండ్రి మృతి కేసులో పదేళ్లు జైలు శిక్ష విధించింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications