Axis Bank Glitch: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు షాక్-ఇతరుల ఖాతాల్లోకి యాక్సెస్..?
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు భారీ షాక్ లాంటి వార్త అందుతోంది. యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించిన ట్రేడింగ్ పోర్టల్ లో ఏర్పడిన ఓ సాంకేతిక సమస్య ఇప్పుడు కస్టమర్లను ఆందోళనలోకి నెడుతోంది. ఎందుకంటే ట్రేడింగ్ పోర్టల్ లోకి వెళ్తుంటే తమ ఖాతాతో పాటు ఇతరుల ఖాతాల్లోకి యాక్సెస్ లభిస్తోందని, అలాగే వారి తరఫున ట్రేడింగ్ చేసేందుకు కూడా అవకాశం ఉందని పలువురు ఖాతాదారులు ఫిర్యాదులు చేస్తున్నారు.
వెంకీ అనే ఎన్నారై తాజాగా యాక్సిస్ బ్యాంక్ ట్రేడింగ్ అకౌంట్ లోకి వెళ్తుంటే ఇతరుల ఖాతాలు కూడా తనకు కనిపిస్తున్నాయని గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ కు వెల్లడించాడు. అయితే ఇలా కొన్నిసార్లు మాత్రమే జరుగుతుందని అతను వెల్లడించాడు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతున్న సమయంలో ఈ సమస్య ఎదురవుతోందని ఆయన తెలిపాడు. దీంతో మార్కెట్ ట్రేడింగ్ సమయంలోనే ఈ సమస్య తలెత్తుతున్నా యాక్సిస్ బ్యాంక్ కానీ సెబీ కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. దీనికి ఆధారంగా తాను యాక్సిస్ బ్యాంక్ తో పాటు రిజర్వ్ బ్యాంక్, సెబీకి పెట్టిన మెయిన్స్ ను గుడ్ రిటర్న్స్ పోర్టల్ తో పంచుకున్నాడు.

వెంకీ చేసిన ఫిర్యాదు ఆధారంగా చూస్తే ఇందులో వ్యక్తిగత సమాచార భద్రత, డేటా గోప్యత, డేటా రక్షణ, రెగ్యులేటరీ బ్రీచ్, నైతిక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇలాగే తనకు తెలియకుండా, సమ్మతి లేకుండా తన ఖాతాలో ఎవరైనా లావాదేవీలు జరపవచ్చనే అంశంపై చాలా ఆందోళన చెందుతున్నట్లు వెంకీ తెలిపాడు.

తన ఖాతాలో జరిగిన ఏవైనా అనధికారిక లావాదేవీలకు తాను బాధ్యత వహించనని, తన నష్టాలకు, అన్నింటికీ యాక్సిస్ బ్యాంక్ నుండి పరిహారం కావాలని ఆయన కోరుుతున్నాడు. ఈ సాంకేతిక సమస్య కారణంగా తాను ఎదుర్కొనే ఒత్తిడి, కష్టాలు కస్టమర్ల డేటాను రక్షించడానికి, నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాక్సిస్ బ్యాంక్‌ని కోరాడు.












Click it and Unblock the Notifications