Big Shot: ఫేమస్ ట్రావెల్స్, 50 బస్సుల యజమాని, మూడురోజులుగా మాయం, చెరువులో శవం !
బెంగళూరు/ శివమొగ్గ: ట్రావెల్స్ యజమానిగా ఆయన కొన్ని జిల్లాలో అందరికి తెలుసు. 20 సంవత్సరాల నుంచి సుమారు 50 బస్సులకు పైగా ప్రజల్లో తిప్పుతున్న ప్రముఖ ట్రావెల్స్ యజమాని మాజీ సీఎం సొంత జిల్లాలో చాలా ఫేమస్. ఆ ట్రావెల్స్ యజమాని గురించి స్థానిక ప్రజలకు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బ తరువాత ఆ ట్రావెల్స్ యజమానికి చాలా ఇబ్బందులు ఎదురైనారు. ఎన్ని దెబ్బలు పడినా ఆ ట్రావెల్స్ యజామని మాత్రం ఆయన దగ్గర పని చేస్తున్న వారిని ఆదుకోవడానికి వెనకడుగు వెయ్యలేదు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా గట్టిగా నిలబడిన ట్రావెల్స్ యజమాని మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి ట్రావెల్స్ యజమాని కోసం పోలీసులు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో ఓ చెరువులో ట్రావెల్స్ యజమాని శవమై కనిపించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు హడలిపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసం 50కి పైగా బస్సులు నడుపుతున్న ట్రావెల్స్ యజమాని శవమై కనిపించడం కలకలం రేపింది.

ఫేమస్ ట్రావెల్స్ యజమాని
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగరలో ప్రకాష్ (54) నివాసం ఉంటున్నారు. శివమొగ్గ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రకాష్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. ప్రకాష్ ట్రావెల్స్ యజమాని అయిన ప్రకాష్ శివమొగ్గ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా ప్రజలకు చాలా సంవత్సరాలుగా తెలుసు.

మాజీ సీఎం సొంత జిల్లా
ప్రకాష్ ట్రావెల్స్ యజమానిగా ప్రకాష్ కొన్ని జిల్లాలో అందరికి తెలుసు. 20 సంవత్సరాల నుంచి సుమారు 50 బస్సులకు పైగా ప్రజల్లో తిప్పుతున్న ప్రముఖ ట్రావెల్స్ యజమాని ప్రకాష్ కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప సొంత జిల్లాలో చాలా ఫేమస్. ప్రకాష్ ట్రావెల్స్ యజమాని ప్రకాష్ గురించి స్థానిక ప్రజలకు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.

గట్టిగా ఎదురు నిలబడిన ట్రావెల్స్ యజమాని
కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బ తరువాత ప్రకాష్ ట్రావెల్స్ యజమాని ప్రకాష్ చాలా ఇబ్బందులు ఎదురైనారు. ఎన్ని దెబ్బలు పడినా ట్రావెల్స్ యజామని ప్రకాష్ మాత్రం ఆయన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి వెనకడుగు వెయ్యలేదు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ప్రకాష్ చాలా గట్టిగా నిలబడ్డారు.

శవమైన ట్రావెల్స్ యజమాని
ప్రకాష్ ట్రావెల్స్ యజమాని ప్రకాష్ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి ట్రావెల్స్ యజమాని ప్రకాష్ కోసం పోలీసులు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో హోసనగర తాలుకాలోని పెటగుప్ప సమీపంలోని ఓ చెరువులో లో ట్రావెల్స్ యజమాని ప్రకాష్ శవమై కనిపించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు హడలిపోయారు. అయితే ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications