న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఆమోదం

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో కొత్తగా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. న్యాయమూర్తుల నియామకం, బదలీల వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది.

ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం మోడీ ప్రభుత్వానికి పెద్ద విజయమని చెప్పవచ్చు.

ఈ బిల్లు నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు కానుంది. దేశంలోని పలు కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల వ్యవహారాలను ఈ కమిటీయే చూస్తుంది. ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో ఈ కమిటీ కొత్తగా ఏర్పాటవుతోంది.

Big win for NDA govt as Lok Sabha passes Judicial Appointments Bill

న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందంటూ కొన్ని రోజుల కిందట ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్, జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇందుకు మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని తీసుకొస్తోంది.

ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. అయితే, రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బిల్లులో కాంగ్రెస్ పార్టీ కొన్ని సవరణలు డిమాండ్ చేసే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+