ఘోర బస్సు ప్రమాదం: 27మంది సజీవ దహనం
పాట్నా: బీహార్‌లోని మోతీహరి ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మోతీహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో 27మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొంత మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications