బీహార్లో 65 శాతానికి చేరిన రిజర్వేషన్లు-బిల్లుకు అసెంబ్లీ ఆమోదం-సుప్రీం గీత దాటేసి..

సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్లో కుల రాజకీయాలు పతాకస్ధాయికి చేరాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇండియా కూటమి పార్టీలు అధికారంలో బీహార్లో కులాల సర్వే చేపట్టిన నితీశ్ కుమార్ సర్కార్.. ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో కులాల సర్వేలో బయటబడిన గణాంకాల ఆధారంగా రిజర్వేషన్ల పరిమితిని పెంచుతూ నితీశ్ కుమార్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోద ముద్ర పడింది. దీంతో బీహార్లో రిజర్వేషన్లు 65 శాతానికి చేరాయి.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచే బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఇవాళ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటిపోయాయి. సవరించిన బిల్లు చట్టరూపం దాల్చడానికి ముందు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదం మాత్రమే మిగిలింది.

bihar assembly nod to 65 percent reservations to past supreme court cap

మహిళల విద్య, జనాభా నియంత్రణపై సీఎం నితీష్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఇవాళ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. అయితే ఈ గందరగోళం మధ్యే రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. సవరించిన కోటాల ప్రకారం, ఎస్సీ అభ్యర్థులకు 20 శాతం, ఓబీసీలకు 18, ఈబీసీలకు 25 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఎస్టీలకు రెండు శాతానికి రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈబీసీలకు 18 శాతం, వెనుకబడిన తరగతులకు 12 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 16 శాతం, షెడ్యూల్డ్ తెగలకు ఒక శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రస్తుతం ఉన్న మూడు శాతం రిజర్వేషన్‌ను రద్దు చేశారు.

బీహార్ అసెంబ్లీలో సవరించిన బిల్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి 10 శాతం రిజర్వేషన్‌ను మినహాయించింది, అలాగే మొత్తం కోటాలను 75 శాతానికి తీసుకువెళ్లబోతోంది. బీహార్‌లోని 13.1 కోట్ల మందిలో 36 శాతం మంది ఈబీసీలకు చెందిన వారని, 27.1 శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారని గతంలో కులాల సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ఇప్పుడు రిజర్వేషన్లను కూడా పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+