ఏంటది.. తీసిపడేసేయ్.. మహిళ పట్ల అదేం పని ముఖ్యమంత్రి జీ!(వీడియో)
బీహార్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎన్డీయే కూటమి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్.. తాజాగా ఓ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా డాక్టర్ హిజాబ్‌ను (తల, ముఖం కప్పి ఉంచే వస్త్రం) లాగి తీసివేయడంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
వీడియోలో ఏం జరిగింది?
పాట్నాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలను పంపిణీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. 74 ఏళ్ల సీఎం నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలికి సర్టిఫికెట్ ఇస్తూ, ఆమె హిజాబ్‌ను తీయమని సైగ చేయడం వీడియోలో కనిపిస్తుంది. ఆమె స్పందించేలోపే నితీష్ కుమార్ స్వయంగా చేయి చాచి ఆమె హిజాబ్‌ను లాగి తీసివేశారు, ఆమె నోరు, ముఖం కనిపించేలా చేశారు. అక్కడ ఉన్న కొంతమంది నవ్వుతూ కనిపించారు. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి జోక్యం చేసుకుని ఆపడానికి ప్రయత్నించినట్లుగా కూడా వీడియోలో ఉంది.

ప్రతిపక్షాల స్పందన
ఈ చర్యపై కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. కాంగ్రెస్ ఈ చర్యను హేయమైన, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. "రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇంత నీచమైన చర్యకు పాల్పడితే, రాష్ట్రంలో మహిళలకు ఎంత భద్రత ఉంటుంది?" అని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆర్జేడీ (RJD) పార్టీ ముఖ్యమంత్రి మానసిక ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. "నితీష్ జీకి ఏమైంది? ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా దారుణంగా మారింది" అని ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. ఆర్జేడీ ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ముస్లిం మహిళ ముసుగును (హిజాబ్) బలవంతంగా తొలగించడం అనేది ఆమె సాంస్కృతిక, మతపరమైన హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు.
यह क्या हो गया है नीतीश जी को?
— Rashtriya Janata Dal (@RJDforIndia) December 15, 2025
मानसिक स्थिति बिल्कुल ही अब दयनीय स्थिति में पहुंच चुकी है या नीतीश बाबू अब 100% संघी हो चुके हैं?@yadavtejashwi #RJD #bihar #TejashwiYadav pic.twitter.com/vRyqUaKhwm
గతంలోనూ వివాదాలు
నితీష్ కుమార్ ప్రజా ప్రవర్తనకు సంబంధించి గతంలో కూడా కొన్ని వివాదాలు చెలరేగాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఒక బహిరంగ సభలో మహిళా అభ్యర్థికి బలవంతంగా దండ వేయడానికి ప్రయత్నించిన వీడియో కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ సంఘటనలు నితీష్ కుమార్ పాలనా సామర్థ్యంపై, మానసిక ఆరోగ్యానికి సంబంధించి జన సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ వంటి నాయకులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేయడానికి దారితీశాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications