న‌ర్సుపై కన్నేసిన డాక్ట‌ర్‌.. కామాంధుడి జ‌న‌నాంగాల‌ను కోసిప‌డేసింది!

ఆస్ప‌త్రి వైద్యుడు, సిబ్బంది క‌లిసి ఓ న‌ర్సుపై అత్యాచారయ‌త్నం చేశారు. అయితే, ఆ న‌ర్సు అప‌ర‌కాళిలో తిర‌గ‌బ‌డింది. ఎదుర‌దాడి చేసి మరీ అక్క‌డినుంచి త‌ప్పించుకుంది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన కామాంధుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలి సాహ‌సాన్ని ప‌లువురు ప్ర‌శంశిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బిహార్ రాష్ట్రం సమస్తిపుర్‌ జిల్లాలోని ఆర్‌బీఎస్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో ఓ మ‌హిళ న‌ర్సుగా ప‌నిచేస్తోంది. ఎప్ప‌టిలాగే బుధవారం రాత్రి ఆస్ప‌త్రిలో విధుల్లో ఉండగా.. అక్క‌డి వైద్యుడితోపాటు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్‌ సంజయ్‌ కుమార్‌, ఇద్దరు సహాయకులతో కలిసి న‌ర్సుపై సామూహిక అత్యాచారయత్నం చేశారు. దీంతో తొలుత‌ భ‌య‌ప‌డిన ఆమె, త‌న‌లోని ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకుంది. అప‌ర‌కాళిలా ప్ర‌తిగ‌టించింది. అయినా ఆ కామాంధులు ఆమెను లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ప‌దునైన బ్లేడుతో వైద్యుడి జ‌న‌నాంగాలు కోసేసి, చాక‌చ‌క్యంగా అక్క‌డి నుంచి త‌ప్పించుకుంది.

Bihar Doctor genetials were cut off after he attempted a rape on nurse

మౌనంగా ఉండిపోలేదు..

అయితే, ఆస్ప‌త్రి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మౌనంగా ఉండిపోలేదు. జ‌ర‌గిన విష‌యాన్ని పోలీసుల‌కు తెలియ‌జేసింది. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు నిందితుల‌ను అదుపులోకి తీస‌కున్నారు. ఘటన జరిగిన సమయంలో వైద్యుడితోపాటు ఇతర నిందితులు మద్యం మత్తులో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై డీఎస్పీ సంజయ్‌ కుమార్‌ పాండే మాట్లాడుతూ.. వైద్యుడితోపాటు మిగతా నిందితుల‌ను అరెస్టు చేశామ‌న్నారు. వీరంతా ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌క‌రాం.. ఆసుపత్రి ప్రధాన ద్వారానికి లోపలివైపు నుంచి తాళం వేశార‌ని, అలాగే సీసీటీవీలను ఆపేసినట్లు గుర్తించిన‌ట్లు తెలిపారు. ఈ స‌మ‌యంలో న‌ర్సు ధైర్యసాహ‌సాల‌ను ఈ సంద‌ర్భంగా డీఎస్పీ ప్ర‌శంశించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+