Bihar Election Exit Poll LIVE 2025:ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడుతున్నాయి..?
రెండు నెలల ఉత్కంఠకు తెరపడింది. బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6వ తేదీన తొలి దశ పోలింగ్ 121 స్థానాలకు జరుగగా.. రెండవ దశలో భాగంగా నవంబర్ 11వ తేదీ 122 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తానికి 243 స్థానాలున్న బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ముగిశాయి. ఇక పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ సందడి ప్రారంభం కానుంది. 122 స్థానాలు మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ అందుకుంటే అదే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ద్వారా వెలువడే ఫలితాలే దాదాపుగా నిజమయ్యే అవకాశాలున్నాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఎన్డీయే కూటమి ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్యే జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. అయితే ఓటర్లు మాత్రం తమ తీర్పును ఇచ్చేశారు. ఇక ఫలితాలన్నీ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. అయితే పలు సంస్థలు, సెఫాలజిస్టులు చేసిన సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తారు. సాయంత్రం 6:30 లేదా 7 గంటల ప్రాంతంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అవుతాయి. ఇక బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌తో పాటు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కానున్నాయి. ఏ సంస్థ ఎవరికి ఎలాంటి నెంబర్ ఇస్తుందో మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.













Click it and Unblock the Notifications