చేతబడి చేసిందని మహిళను నగ్నంగా ఊరేగించారు

 Bihar horror: Woman forced to eat human excreta on witchcraft charge
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తుందనే ఆరోపణలతో ఓ మహిళను మానవ మలమూత్రాలను తినిపించడమే గాక ఆమెను నగ్నంగా ఊరంతా తిప్పించారు.

సక్రైలి గ్రామంలో కనియా దేవి అనే మధ్య వయస్కురాలైన చేతబడి మంత్రాలు చేస్తుందనే ఆరోపణలతో అసభ్యకరంగా దూషించి తీవ్రంగా కొట్టారు. ఆమె చేతబడి చేయడం వల్లే గ్రామంలోని ఓ బాలుడి మృతి చెందాడని అనుమానించిన కొందరు గ్రామస్తులు ఆమెపై దాడికి పాల్పడ్డారు.

అంతేగాక ఆమెతో మానవ మలమూత్రాదులను తినిపించి.. నగ్నంగా ఊరంతా తిప్పారు. ఘటనపై స్పందించిన పోలీసులు, ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసు అధికారి రాకేష్ కుమార్ తెలిపారు.

బీహారల్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేతబడి చేస్తుందనే ఆరోపణలతో మహిళలపై ఇలాంటి దాడులకు, వేధింపులకు పాల్పడటం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదన అందజేసింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా చూడాలని రాష్ట్ర పోలీస్ అధిపతికి ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+