Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నడిరోడ్డుపై బైక్ పార్కింగ్... పక్కకు తీయమన్నందుకు ట్రాఫిక్ పోలీస్‌నే చితక్కొట్టాడు...

ఓ వ్యక్తి నడిరోడ్డుపై తన బైక్ పార్క్ చేశాడు... వెంటనే అక్కడి నుంచి బండి తీయాలని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించాడు... ఆ వ్యక్తి బైక్ తీయలేదు సరికదా ట్రాఫిక్ పోలీస్ పైనే తిరగబడ్డాడు.. అతన్ని కింద పడేసి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు.బిహార్‌లోని జెహనాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

జెహనాబాద్‌లోని ఓ రద్దీ రోడ్డు మార్గంలో శుక్రవారం(సెప్టెంబర్ 1) ఓ వ్యక్తి బైక్‌పై వచ్చాడు.ఉన్నట్టుండి బైక్‌ను నడిరోడ్డుపై పార్క్ చేశాడు.ట్రాఫిక్‌ జామ్ అవుతుందని... బండిని రోడ్డు నుంచి పక్కకు తీయాలని అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ హెచ్చరించాడు.సదరు వ్యక్తి బైక్ తీయకపోగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కిందపడేసి దాడికి పాల్పడ్డాడు. ఆపై బైక్ అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతను ఎటువైపు వెళ్లాడో పరిశీలిస్తున్నారు.

bihar man attacks a traffic police for warns him to remove bike on the road

ఇదే బిహార్‌లో నాలుగు రోజుల క్రితం ఓ దారుణం చోటు చేసుకుంది.. 24 ఏళ్ల ఓ గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. రాత్రిపూట భోజనం తర్వాత ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు ఆమెను అపహరించారు. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను పాట్నా రైల్వే జంక్షన్‌లో విడిచిపెట్టేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాల ప్రకారం... బిహార్‌లో 2019తో పోలిస్తే 2020లో మహిళలపై నేరాల సంఖ్య 17.3శాతం మేర తగ్గింది. అదే సమయంలో అత్యాచార ఘటనలు మాత్రం 10.7శాతం పెరిగాయి. 2019లో బిహార్‌లో 730 మంది అత్యాచారాలకు గురవగా 2020లో 806 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. మరో 110 అత్యాచారయత్నం కేసులు,లైంగిక దాడులు జరిపే ఉద్దేశంతో 584 దాడులు జరిగాయి. మొత్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి గతేడాది బిహార్‌లో 15,359 కేసులు నమోదయ్యాయి.ఇందులో 6671 కిడ్నాప్ కేసులు ఉన్నాయి. మహిళల కిడ్నాప్ విషయంలో యూపీ 9109,పశ్చిమ బెంగాల్ 7740 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అత్యాచార కేసులో నిందితుడికి 8 ఏళ్ల జైలు శిక్ష :

జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కోర్టు రూ.50వేలు జరిమానాతో పాటు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో నిందితుడికి రూ.25వేలు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఇద్దరికీ జరిమానాగా విధించిన మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.2015లో ఈ ఘటన జరగ్గా... తాజాగా తుది విచారణ జరిపిన కోర్టు నిందితులను దోషులుగా తేల్చి శిక్షలు ఖరారు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+