బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఆయనే!

Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం సీఎం అభ్యర్థి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహాఘటబంధన్(ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి) తమ సీఎం అభ్యర్థిగా యువ నాయకుడు తేజస్వి యాదవ్‌ను ప్రకటించిన వెంటనే. అధికార కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(NDA) కూడా తమ నాయకుడిగా ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ పేరును ఖరారు చేసింది. ఎన్డీయేకు మెజారిటీ లభిస్తే నితీష్ కుమారే తదుపరి ముఖ్యమంత్రి అవతారని బీజేపీ స్పష్టం చేసింది.

గందరగోళానికి తెరదించిన బీజేపీ
బీహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ మొదట్లో స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం అనేక ఊహాగానాలకు దారితీసింది. ఎన్డీయే పదే పదే నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. గెలిచిన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో గందరగోళం ఉంది. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు తమ సీఎంను ఎన్నుకుంటారు" అని చెప్పడమే. ఈ ప్రకటన నితీష్ కుమార్ ప్రాధాన్యతను తగ్గిస్తున్నట్లుగా కనిపించింది.

Bihar Politics Turns Crucial Nitish Kumar Declared NDA CM Candidate for 2025 Elections

ప్రధాన కారణం ఇదే..
అయితే మహాఘటబంధన్ దీన్ని ఓ ఆయుధంగా మలుచుకుంది. తమ ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ.. "ఎన్డీయేలో సీఎం అభ్యర్థి ఎవరో బీజేపీ ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు? అమిత్ షా ప్రకటనపై నితీష్ మౌనం ఎందుకు?" అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. ఈ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవడానికి బీజేపీ తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఏర్పడింది.

బీజేపీ అగ్రనేత సంచలన ప్రకటన
ఈ నేపథ్యంలో బీహార్ బీజేపీలో కీలక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి రంగంలోకి దిగారు. ముంగేర్ జిల్లాలోని తారాపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు. సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ, "మా వద్ద ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ లేదు. నితీష్ జీ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు, మున్ముందు కూడా ఆయనే కొనసాగుతారు. 2005 అక్టోబర్‌లో నితీష్ కుమార్‌ను తొలిసారి సీఎం అభ్యర్థిగా ప్రకటించింది కూడా బీజేపీయే. నితీష్ కుమార్ భావజాలం వేరుగా ఉన్నప్పటికీ, ఎన్డీయే కూటమిలో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ఆయనే. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదు" అని కుండబద్దలు కొట్టారు.

బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు

ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి రాబోయే ఐదేళ్లలో తమ కూటమి లక్ష్యాలను కూడా వివరించారు. రాబోయే ఐదేళ్లలో బీహార్‌కు రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం 7282 ఎకరాల రిజర్వ్ ల్యాండ్ అందుబాటులో ఉండగా, 50,000 ఎకరాల భారీ ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

చారిత్రక బంధాన్ని గుర్తు చేసిన సామ్రాట్ చౌదరి
నితీష్ కుమార్ దాదాపు 29 ఏళ్లుగా (మధ్యలో కొంత విరామం మినహా) బీజేపీతో కలిసి ప్రయాణం చేశారని సామ్రాట్ చౌదరి గుర్తు చేశారు. బీజేపీ మద్దతుతోనే లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ముఖ్యమంత్రులు అయ్యారని తెలిపారు. 1990లో లాలూ యాదవ్ ముఖ్యమంత్రి అయిన జనతాదళ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇచ్చింది, కానీ లాలూ కేవలం ఆరు నెలల్లోనే బీజేపీకి దూరమయ్యారు.అయితే, నితీష్ కుమార్ మాత్రం బీజేపీతో తన అనుబంధాన్ని కొనసాగించారని ఆయన చారిత్రక విషయాలను వెల్లడించారు.

జేడీయూ ధ్రువీకరణ
బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ప్రకటనకు మద్దతుగా.. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా కూడా స్పందించారు. ఎన్డీయేలో నితీష్ కుమార్‌ను తదుపరి సీఎంగా ప్రకటించడానికి పూర్తి ఏకాభిప్రాయం ఉందని, మిత్రపక్షాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో బీహార్ ఎన్నికల్లో నాయకత్వ అంశంపై నెలకొన్న అనిశ్చితికి తాత్కాలికంగా ముగింపు పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+