Viral Video: రైలులో దొంగకు చుక్కలు చూపించిన ప్యాసింజర్స్.. అబ్బా ఏం ఫీల్ ఉంది మామా ఈడ..
సాధారణంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగలు ఎక్కువగా సంచరిస్తుంటారు. బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్స్ లో ప్రయాణికుల్ని ఏమార్చి దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు.ఇక రద్దీగా ఉండే రైలులో చాలా దొంగతనాలు జరుగుతుంటాయి. ప్రయాణికుల నుంచి ఫోన్లు, పర్సులు చోరీ చేసి నెక్స్ట్ స్టేషన్ లో మెల్లగా దిగిపోతుంటారు దొంగలు. అయితే తాజాగా బీహార్ లోని భాగల్ పూర్ జిల్లా శివ నారాయణ్ పూర్ రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన జరిగింది.

శివ నారాయణ్ పూర్ రైల్వే స్టేషన్ లో రైలు ఆగింది. అదే సమయంలో స్టేషన్ ప్లాట్ ఫామ్ పై ఉన్న ఓ దొంగ.. రైలు కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్ ఫోన్ ను చోరీ చేసేందుకు లోపలికి చేయి పెట్టాడు. అదే సమయంలో అప్రమత్తమైన ప్యాసింజర్లు వెంటనే ఆ దొంగ చేతిని లోపల నుంచి పట్టుకున్నారు. రైలు ముందుకు కదిలినా ఆ దొంగ చేతిని విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నారు. దాంతో తప్పించుకునే మార్గం లేక కిటికీకి వేలాడుతూ కాసేపు దొంగ విలవిల్లాడాడు. ప్లీజ్ తనను వదిలేయండి అంటూ ఆ దొంగ ప్రయాణికులను కోరాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Shocking: At Shivnarayanpur Railway Station, a thief tried to snatch a mobile phone from a moving train and run away, but he was caught and held through the window https://t.co/Eii1vALd4u
— Ramesh Speaks (@rameshofficial0) October 12, 2026
ఇక అలా కొద్దిదూరం వెళ్లాక పట్టు తప్పి ఆ దుండగుడు ప్లాట్ ఫామ్ మీద పడిపోయాడు. ఆ తర్వాత ఆ దొంగను రైల్వే భద్రతా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రైల్వే స్టేషన్లు, రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే సంబంధిత రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ కు సమాచారం అందించాలని చెబుతున్నారు. అలాగే రైల్ మదాద్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సరైన భద్రత లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
