వంగవీటి రాధాకే కాదు, ముద్రగడ కుమార్తెకు పవన్ కీలక పదవి- సీట్లు ఖరారు..!?
డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల వేళ జనసేన పోటీ చేసే సీట్ల విషయంలో కూటమిలో పట్టు బడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు వేగవంతం చేసారు. వంగవీటి రాధా జనసేనలో చేరారు. ఆయన కు పదవి ఫిక్స్ చేసారు. అదే విధంగా మరో వైపు ముద్రగడ కుమార్తె క్రాంతికి పవన్ కీలక పదవి అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ముందుగా మున్సిపల్, ఆ తరువాత జెడ్పీటీసీ -ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ జనసేన పోటీ చేయాలని డిసైడ్ అయిన సీట్లు దక్కించుకునేందుకు పట్టు వీడటం లేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు వద్ద జనసేన నేతలు సీట్ల సర్దుబాటు పైన చర్చలు చేస్తున్నారు. ఆరు కార్పోరేషన్లు.. 40 మున్సిపాల్టీల కోసం జనసేన పట్టుబడుతోంది.

అయితే, జనసేనకు ఇస్తారని చెబుతున్న కాకినాడ కార్పోరేషన్ లో ఎన్నిక కోర్టు తీర్పు తరువాత జరగనుంది. కాగా.. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో జనసేన పోటీ చేసే కార్పోరేషన్, మున్సిపాల్టీల పై స్పష్టత రానుంది. విజయవాడ జనసేనకు ఖరారైంది. ఇక్కడ పార్టీ అభ్యర్దిగా వంగవీటి రాధా పోటీ చేయనున్నారు. కొద్ది సేపటి క్రితమే పవన్ సమక్షంలో రాధా జనసేనలో చేరారు.
వంగవీటి రాధాకు విజయవాడ మేయర్ పదవి ఇస్తున్న పవన్.. అటు ముద్రగడ కుమార్తె క్రాంతికి కీలక పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ముద్రగడ 2024 ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరారు. ఆయన కుమార్తె జనసేనలో పవన్ సమక్షంలో చేరిన సమయంలో రాజకీయంగా చర్చ జరిగింది. అప్పటి నుంచి ముద్రగడ కుమార్తె జనసేనలో కొనసాగుతున్నారు. ముద్రగడ మరణం సమయంలోనూ చివరి చూపు కోసం క్రాంతిని అనుమతించే విషయంలో కొంత గందరగోళం చోటు చేసుకుంది.
కాగా.. ఇప్పుడు క్రాంతికి కాకినాడ లేదా తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా జనసేన నుంచి బలోకి దింపాలని భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. కూటమి సర్దుబాటులో భాగంగా ఈ రెండు సీట్లలో జనసేనకు దక్కే సీటు నుంచి క్రాంతి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ రెండు స్థానాలు మహిళలకే కేటాయించారు. దీంతో.. ఇటు రాధా.. అటు ముద్రగడ కుమార్తెకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా పవన్ కొత్త వ్యూహలను అమలు చేస్తున్నారనే చర్చ వినిపిస్తోంది. క్రాంతి పదవి పైన అధికారికంగా నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
