Jailer 2 First Review: రజనీకాంత్ 'జైలర్ 2' ఫస్ట్ రివ్యూ ఇదే..
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే కోలీవుడ్ లోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లోనే పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. హిట్స్.. ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ రంబోలా చేస్తుంటాయి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ కాంబోలో 2023 లో వచ్చిన 'జైలర్' మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. అందులో ఇండియా గ్రాస్ సుమారు రూ.400 కోట్లకుపైగా ఉండగా.. ఓవర్సీస్ నుంచి దాదాపు రూ.196 కోట్లు వచ్చినట్లు సమాచారం. అలాగే తమిళ సినిమాల్లో రూ.500 కోట్ల మార్క్ దాటిన అతి కొద్ది సినిమాల్లో 'జైలర్' మూవీ ఒకటిగా నిలిచి సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో నిరూపించింది.
అయితే ఈ మూవీకి సీక్వెల్ గా తాజాగా జైలర్ 2 మూవీ వస్తోంది. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ లో జోరుగా బుకింగ్స్ జరుగుతున్నాయి. జైలర్ 2 ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక జైలర్ 2 లో రజినీకాంత్ ముత్తువేల్ పాండియన్ గా కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నాతో పాటు ఎస్. జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజారమూడు కూడా కీలక పాత్రల్లో నటించారు. వీరితోపాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా మెరవనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికేట్ ను అందించింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. అయితే జైలర్ 2 కు సంబంధించి ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ ఫస్టాఫ్ లో డార్క్ హూమర్ తోపాటు రజనీకాంత్ మాస్ ఎలివేషన్లు, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ జైలర్ పార్ట్ 1 మాదిరిగానే ఇక్కడ కూడా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని సమాచారం. ఇక సెకండాఫ్ లో కీలక మలుపులు ఉంటాయని.. క్లైమాక్స్ లో వచ్చే అతిథి పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. జైలర్ 2 మూవీలో విలన్ పాత్రను కూడా బలంగా తీర్చిదిద్దినట్లు కొన్ని కథనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి మరికొన్ని గంటల్లో జైలర్ 2 మూవీ రిలీజ్ కానుంది. ఫుల్ రివ్యూ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications
