Bihar Results 2025: ఫలితాల వేళ బీహార్ లో కీలక పరిణామాలు-సీసీ కెమెరాలు ఆఫ్..!
బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు ఈసారి రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విపక్ష మహాకూటమి అప్రమత్తమైంది. భారీ ఎత్తున ఆర్జేడీ శ్రేణుల్ని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్దకు తేజస్వీ యాదవ్ పంపుతున్నారు.
బీహార్ లో రెండో విడత ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంలను ఎన్నికల సిబ్బంది తరలించారు. అక్కడ రేపటి వరకూ వాటిని భద్రపర్చాల్సి ఉంది. రేపు ఉదయం కౌంటింగ్ సమయంలో వీటిని తెరిచి ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించాల్సి ఉంది. వీటిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లకు భారీ భద్రత కల్పించారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంత భద్రత మధ్య కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

भागलपुर जिले के मतगणना केंद्र के CCTV कैमरा नंबर 7 और 27, दोनों कैमरों से कहलगांव विधानसभा के EVM वाले स्ट्रांग रूम का फीड मिल रहा था, घंटों से बंद है।
— Tejashwi Yadav (@TejashwiYdvRJD) November 13, 2025
ऊपर से नीचे तक कोई भी अधिकारी कुछ भी जवाब नहीं दे रहा है!
इतना ही नहीं, इसे जल्द से जल्द ठीक करवाने का भी घंटों से कोई भी… pic.twitter.com/dzcwGWg7z7
ఇవాళ బీహార్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వీటిని ఎన్నికల అధికారులు లైవ్ లో ఉంచారు. అయితే లైవ్ మధ్యలో ఆటంకాలు ఏర్పడి పలు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కెమెరాలు బ్లాంక్ గా కనిపిస్తున్నాయి. అలాగే పలు చోట్ల అసలు సీసీ కెమెరాలు ఓపెన్ కావడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీంతో బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లోపు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

सासाराम में आधी रात में बक्से से भरा हुआ ट्रकस्ट्रॉंग रूम के अंदर घुसा।
— Tejashwi Yadav (@TejashwiYdvRJD) November 13, 2025
आखिर प्रशाशन घुसने कैसे दिया?
ट्रक चालकों को सामने लाए बिना क्यों भगा दिया गया? 2 बजे से यहां CCTV कैमरा का फीड क्यों बंद रहा?
पूरा फुटेज जारी किया जाए!
ट्रक में क्या है प्रशासन बताए!@CEOBihar @ECISVEEP… pic.twitter.com/6oZ11qw0tg
మరోవైపు ఉదయం ససారాంలోని ఈవీఎంలు భద్రపరిచిన ఓ స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఓ అనుమానాస్పద ట్రక్ వచ్చింది. ఇందులో భారీ ఎత్తున ట్రంకు పెట్టెలు ఉన్నాయి. వీటిని దింపుతున్న దృశ్యాలు కనిపించాయి. అయితే దాని వివరాలు అడిగితే ఇవ్వడం లేదంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. అలాగే పలు చోట్ల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని ఆయన వీడియో తీసి మరీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అసలే బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే విజయం తథ్యమని సర్వే సంస్థలు ముక్తకంఠంతో చెప్పేశాయి. దీన్ని నిజం చేసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు తేజస్వి ఆరోపిస్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications