Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..!

2002లో గుజరాత్ అల్లర్ల సందర్భంగా గ్యాంగ్ రేప్ కు గురై, తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన బిల్కిస్ బానో కేసులో (Bilkis Bano Case) దోషులుగా నిర్ధారణ అయి 17 ఏళ్లుగా జైల్లో ఉన్న ఇద్దరికి ఇవాళ సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఊరట కల్పించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న బిపిన్ చంద్ కన్నయ్యలాల్ జోషి, ప్రదీవ్ రామన్గల్ మోధియాకు విధించిన జీవిత ఖైదును నిలిపేయడమే కాకుండా, షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది.

కేంద్రం తక్షణ సాయం కోరిన చంద్రబాబు ..! భవిష్యత్తులో తుఫాన్లు ఎదుర్కోవాలంటే..?
కేంద్రం తక్షణ సాయం కోరిన చంద్రబాబు ..! భవిష్యత్తులో తుఫాన్లు ఎదుర్కోవాలంటే..?

గతంలో ఈ కేసులో బాంబే హైకోర్టు బిపిన్ చంద్ కన్నయ్యలాల్ జోషి, ప్రదీవ్ రామన్గల్ మోధియాను దోషులుగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా 17 ఏళ్లుగా వీరిద్దరూ జైల్లో మగ్గుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. ఇందులో ఒకరు తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతున్నట్లు గుర్తించింది. అలాగే దోషుల్లో ఒకరి పేరు ఎఫ్ఐఆర్ లో లేదని, ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత అతన్ని ఇరికించారని కూడా వ్యాఖ్యానించింది.

Bilkis Bano Case Supreme Court Grants Conditional Bail to Two Convicts After 17 Years in Jail
OBC కోటా ఉద్యోగాల క్రీమిలేయర్ పై సుప్రీంకోర్టు స్పష్టత..! కేంద్రం అభ్యర్ధనకు నో..!
OBC కోటా ఉద్యోగాల క్రీమిలేయర్ పై సుప్రీంకోర్టు స్పష్టత..! కేంద్రం అభ్యర్ధనకు నో..!

ఈ ఇద్దరు దోషుల తరఫున హాజరైన లాయర్లు.. గుజరాత్ అల్లర్లలో ఈ ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత వారిని అరెస్టు చేసినా.. 17 ఏళ్ల పాటు జైల్లో గడిపారంటూ వాదించారు. కాబట్టి వీరి అప్పీళ్లలో ఇంకా తేలాల్సిన వాస్తవ, చట్టపరమైన అంశాలున్నాయని భావించిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి వారిపై బెయిల్ పై విడుదల చేయాలని ఆదేశించింది. 2002 నాటికి గుజరాత్ అల్లర్ల సమయలో బిల్కిస్ బానోపై జరిగిన గ్యాంగ్ రేప్, ఆమె కుటుంబంపై ఏడుగురి హత్యకు సంబంధించిన కేసులో దోషులుగా తేలిన 11 మందిలో వీరిద్దరూ ఉన్నారు. 2022 ఆగస్టులో దోషుల్ని ముందుగానే విడుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు 2026లో రద్దు చేసింది. అప్పటి నుంచీ వారు జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులతో వారికి ఊరట లభించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+