Viral Video: హెలికాఫ్టర్ కు తాడుకట్టి తీసుకెళ్తున్న మరో ఛాపర్-మధ్యలో తెగిపోయిన తాడు..!
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ లో ఓ అరుదైన హెలికాఫ్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తిన ఓ హెలికాఫ్టర్ ను అక్కడికక్కడే మరమ్మతు చేసే అవకాశం లేకపోవడంతో మరో ఎయిర్ ఫోర్స్ ఛాపర్ ద్వారా తరలించాలని నిర్ణయించారు.
అయితే ఎయిర్ ఫోర్స్ చాపర్ కు తాడు కట్టి ఈ పాడైన హెలికాఫ్టర్ ను వేలాడదీశారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఛాపర్ గాల్లోకి లేచింది. అంతా సజావుగా సాగిపోతుందని భావిస్తున్న తరుణంలో ఆ తాడు తెగిపోయింది.

VIDEO | Uttarakhand: A defective helicopter, which was being air lifted from #Kedarnath by another chopper, accidentally fell from mid-air as the towing rope snapped, earlier today.#UttarakhandNews
— Press Trust of India (@PTI_News) August 31, 2024
(Source: Third Party) pic.twitter.com/yYo9nCXRIw
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ నుండి గౌచర్‌కు ఎయిర్ పోర్స్ చెందిన ఎంఐ-17 ఛాపర్ ద్వారా ఈ పాడైన విమానాన్ని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పాడైన హెలికాఫ్టర్ కు కట్టిన తాడు గాల్లోనే తెగిపోవడంతో వేల అడుగుల ఎత్తు నుంచి ఆ హెలికాఫ్టర్ కిందకు పడిపోయింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేట్ కంపెనీ నడుపుతున్న ఈ హెలికాప్టర్ లించోలిలోని మందాకిని నది సమీపంలో కుప్పకూలినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి గురైన చాపర్ ఇంతకు ముందు కేదార్‌నాథ్ ఆలయానికి ప్రయాణికులను తీసుకెళ్తోంది. హిమాలయ సానువుల్లో ఉన్న కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లే ట్రెక్ మార్గం భారీ వర్షాలకారణంగా దెబ్బతింది. దీంతో జూలై 31 నుండి కేదార్‌నాథ్‌కు వెళ్లే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు, దీంతో ప్రైవేట్ హెలికాప్టర్‌లతో పాటు ఎయిర్ ఫోర్స్ చినూక్ , ఎంఐ 17 హెలికాప్టర్‌ల సహాయంతో సహాయకచర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications