యూరిన్ పోసి వీడియో: ఆరుగురు కలిసి పైశాచిక ఆనందం, కాళ్లు కట్టేసి వీడియో.. ఒంటిపై గాయాలు..
వేడుక కోసం ఇంటి నుంచి బయల్దేరిన అతని ఆచూకీ తెలియలేదు. సాయంత్రం అవుతోన్నా ఇంటికి రాకపోవడంతో పేరంట్స్‌కు ఒక్కటే టెన్షన్. బాబు కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేయగా.. వారు కూడా గాలించారు. కానీ ఫలితం లేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ యువకుడు నగ్నంగా పడి ఉండగా, ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. ఆరుగురు యవకుల బృందం అచేతనంగా పడి ఉన్న యువకుడిపై యూరిన్ పోస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న క్లిప్పింగ్ కనిపించింది. ఆ వీడియో చూసిన పేరెంట్స్ గుండె తరుక్కుపోయింది.

కిడ్నాప్ అని..
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మజ్రీలో భారతి గౌతమ్ అవచ్చారే (49) కుటుంబం ఉంటోంది. గోపాల్ పట్టి ప్రాంతంలో గల వరద్ వినాయక్ సొసైటీలో కుమారుడు శ్రేయాస్ గౌతమ్ అవచ్చారే (15)తో కలిసి ఉంటున్నారు. తమ కాలనీలో శివ జయంతీ నిర్వహిస్తుండటంతో శ్రేయాస్ ఇంటి నుంచి వెళ్లాడు. కానీ ఆ మరునాడు కూడా తిరిగిరాలేదు. దీంతో అతని తల్లి భయాందోళనకు గురయ్యారు. యువకుడి స్నేహితులతో కలిసి గాలించారు. కానీ ఆచూకీ గుర్తించలేకపోయారు. హదాస్‌పూర్ పోలీసు స్టేషన్‌లో గత గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అని భావించారు.

వీడియో వైరల్..
యువకుడి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అవుతోంది. వీడియోలో యువకుడు బట్టలు లేకుండా ఉన్నారు. కాళ్లు కట్టివేసి కనిపించాయి. అంతకుముందే దారుణంగా కొట్టినట్టు గాయాలు కనిపించాయి. యువకుడు ఎదురుగా ఆరుగురు కత్తి పట్టుకొని ఉన్నారు. సృహలో లేని యువకుడిపై యూరిన్ కూడా పోసి పైశాచిక ఆనందం పొందారు. వీడియో చూసిన భారతీ.. తమ కుమారుడేనని గుర్తించారు. మంజ్రీ రైల్వే ట్రాక్ వద్ద సృహలేకుండా అతను పడి ఉండటంతో సాసున్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

నలుగురి అరెస్ట్..
యువకుడిపై దాడి చేసింది ఆరుగురు అని పోలీసులు గుర్తించారు. వారిలో వినిత్ సూర్యాకాంత్ బిరాదర్, శుభం రాజభవు జాదవ్, దేవిదాస్ ఘన్‌శ్యామ్ పావ్‌హానే, భారత్ విశాల్ రాథోడ్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరితో శ్రేయాస్‌కు ఇదివరకు గొడవ జరిగిందని పోలీసులు వివరించారు. శివ జయంతి సందర్భంగా పక్కనే యువకులు మద్యం సేవించి ఉన్నారని... అక్కడ కనిపించిన యువకుడిని పక్కకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.
Recommended Video


గొడవ జరగడంతోనే..
ఆరుగురితో శ్రేయాస్ గొడవ పడ్డారని.. కానీ వారు దారుణంగా దాడిచేసి.. బట్టలు విప్పేసి, మూత్రం పోశారని పోలీసులు వివరించారు. నలుగురిని కస్టడీలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. వీరిపై కిడ్నాప్, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications