వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో బిజెపిVsకేజ్రీవాల్ పార్టీ: కాంగ్రెస్‌కు ఒక్క స్థానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

BJP, AAP may win 2-4 seats each
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏడు లోకసభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి), భారతీయ జనతా పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని సర్వేలు తెలుపుతున్నాయి. సిఎన్ఎన్ఐబిఎన్ - సిఎస్‌డిఎస్ సోమవారం నిర్వహించిన సర్వేలో ఢిల్లీలో బిజెపి, ఎఎపిల మధ్య ఆసక్తికరమైన పోటీ ఉంటుందని తేలింది.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఎఎపి ఢిల్లీలో రెండు నుండి నాలుగు స్థానాలు దక్కించుకుంటుంది. బిజెపి కూడా అన్నే సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెసు ఏడు స్థానాలలో గెలుపొందింది. ఇప్పుడు ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంటుంది.

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పిఎంగా చూడాలనుకుంటున్న వారు 37 శాతం, కేజ్రీవాల్‌ను ఢిల్లీ పీఠంపై చూడాలనుకుంటున్న వారు 26 శాతం, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని చూడాలనుకుంటున్న వారు 15 శాతం ఉన్నారు. అయితే, కేజ్రీవాల్‌ను ప్రధానిగా చూడాలనుంటున్న వారి సంఖ్య తగ్గింది.

జనవరిలో 35 శాతం మంది కేజ్రీవాల్‌ను ప్రధానిగా చూడాలనుకున్నారు. ఇప్పుడు తొమ్మిది శాతం తగ్గింది. సర్వే ప్రకారం... మహారాష్ట్రలో బిజెపి-శివసేన-ఆర్పీఐ కూటమి 23 నుండి 29 లోకసభ స్థానాలు దక్కించుకోవచ్చు. కాంగ్రెస్-ఎన్సీపి కూటమి 16 నుండి 22 సీట్లు దక్కించుకుంటాయి.

English summary
The Lok Sabha election may throw up surprising results in the national capital. According to CNN-IBN-Lokniti-CSDS election tracker both the AAP and BJP are expected to get 2-4 seats each in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X