గోవా ఉప ఎన్నికలు: పారిక్కర్ కుమారుడికి టిక్కెట్ నిరాకరించిన బీజేపీ హైకమాండ్!
పణజి: గోవాలోని పణజి శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేసే అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కుమారుడు ఉత్పాల్ పారిక్కర్ పణజి శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ అవకాశం ఇవ్వలేదు.
గోవా ముఖ్యమంత్రిగా పని చేస్తూ అనారోగ్యంతో మనోహర్ పారిక్కర్ మరణించారు. మనోహర్ పారిక్కర్ మరణంతో మే 19వ తేదీన పణజి శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్దం అయ్యింది. మనోహర్ పారిక్కర్ కుమారుడు ఉత్పాల్ పారిక్కర్ పణజి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు.

పణజి శాసన సభ నియోజక వర్గం నుంచి ఎవ్వరు పోటీ చెయ్యాలి అంటూ బీజేపీ నాయకులు చర్చించారు. పణజి శాసన సభ నియోజక వర్గం నుంచి సిద్దార్థ్ కుంకలేనకర్ ను పోటీ చేయించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. పణజి శాసన సభ నియోజక వర్గం అభ్యర్థి సిద్దార్థ్ కుంకలేనకర్ అని బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది.
గతంలో పణజి నియోజక వర్గం నుంచి సిద్దార్థ్ కుంకలేనకర్ రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మళ్లీ పణజి నియోజక వర్గం అభ్యర్థిగా సిద్దార్థ్ కుంకలేనకర్ పేరును ఖరారు చేశారు. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారిక్కర్ ఎన్నిక అయిన తరువాత ఆయన పోటీ చెయ్యడానికి అప్పటి పణజి నియోజక వర్గం ఎమ్మెల్యే సిద్దార్థ్ కుంకలేనకర్ 2017 మే 10వ తేదీ తన పదవికి రాజీనామా చేశారు. సిద్దార్థ్ కుంకలేనకర్ రాజీనామా చేసి అవకాశం ఇవ్వడంతో మనోహర్ పారిక్కర్ పణజి నియోజక వర్గం నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు.












Click it and Unblock the Notifications