ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన మైసూరు మహారాజు, విజయం లక్షం, యుద్దం కాదు, మోదీ లక్షంతో!
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని అన్ని పార్టీలు సిద్దం అయ్యాయి కర్ణాటకలోని మైసూరు- కొడగు లోక్‌సభ నియోజకవర్గం రాజకీయ ముఖచిత్రం మారే అన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు పర్యాయాలు బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయంగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రతాప్ సింహాను ఈసారి తప్పించిన బీజేపీ హైకమాండ్ మైసూరు మహారాజు యదువీర్‌కు టిక్కెట్టు ఇచ్చింది.
దాంతో లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ హైకమాండ్ మైసూరు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీటన్నింటి మధ్య ప్రస్తుతం మైసూరు రాజకుటుంబ సభ్యుడు యదువీర్ వ్యవహారశైలి చూస్తుంటే.. ఆయన ఇప్పటికే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమైన సంగతి తెలిసింది. ఈసారి బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మూడోసారి గెలిచి కాంగ్రెస్ నేతలకు షాక్ ఇస్తారని చాలా మంది అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తల్లకిందలు చేస్తూ బీజేపీ హైకమాండ్ ఈనిర్ణయం తీసుకుంది.

ప్రతాప్ సింహా వ్యవహారంలో బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేతలకు షాక్ తగలడం కాదు, ఏకంగా సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాకే షాక్ తగిలిందని మైసూరు ప్రజలు అంటున్నారు. రాజకీయాల్లో యువతకు, కొత్తవారికి టిక్కెట్టు వచ్చిన తరువాత, వాళ్లు గెలిచే వరకు కూడా ఆ యువత ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుంది. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాక ఐదేళ్లు రాజకీయ సేవ చేస్తే చాలు అనకునే వాళ్లు ఉన్నారు.
తర్వాత మరొకరికి అవకాశం ఇద్దాం అని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ అనరు. అధికార పీఠం ఎక్కిన తర్వాత మరో టర్మ్ నేనే ఉండాలని అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి రాజకీయాలకు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహానికి వర్తించదని ఆ ప్రాంతం ప్రజలు అంటున్నారు. 2014లో భారతదేశం మొత్తం మోదీ వేవ్ తో ఊగిపోయింది. అంతేకాకుండా దేశంలో అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ను అధికారం నుంచి తరిమికొట్టేందుకు కూడా ప్రజలు సిద్ధమయ్యారు.

దీంతో బీజేపీకి పెద్ద సంఖ్యలో ఓటర్లు మద్దతు పలికారు. అందుకే దేశంలోనే కాకుండా మైసూరు- కొడగు నియోజకవర్గంలో కూడా బీజేపీని ఓటర్లు గెలిపించారు. ఇప్పుడు మైసూరు-కొడుగు లోక్ సభ సీటు మైసూరు మహారాజు యదువీర్ కు ఇచ్చారు. కొడగు జిల్లాలో తిరుగుతున్న యదువీర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు కేజీ బోపయ్య, అప్పచురంజన్‌తో పాటు పలువురు నేతలతో సమావేశమైనా కొడుగు జిల్లాకు చెందిన బీజేపీ నాయకులతో మైసూరు మహారాజు యదువీర్ సమావేశాలు నిర్వహించారు.
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మద్దతుదారులు మినహా చాలా మంది బీజేపీ నేతలు యదువీర్ తో సమావేశం అయ్యి చర్చించారు. ఎంపీ టికెట్ ప్రకటించినప్పటి నుంచి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన యదువీర్ ఎక్కువగా రాజభవనానికి దూరంగా ఉంటూ బీజేపీ నాయకులు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో మమేకం కావడానికి యదువీర్ ప్రయత్నిస్తున్నారు. యదువీర్ ను గమనిస్తే రాజకీయాల్లోకి రావాలని చాలా కాలం క్రితమే ఆయన మానసికంగా అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

గత రెండు రోజులుగా బీజేపీ నేతలే కాకుండా జేడీఎస్ నేతలు, జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ, మాజీ ఎమ్మెల్యే సారా మహేశ్ వంటి పలువురు నేతలతో మైసూరు మహారాజు యదువీర్ సమావేశమై మద్దతు కోరారు. ఎలాగైనా ఎంపీగా గెలవాలనే పట్టుదలతో ఉన్న మహారాజు యదువీర్ అందుకు కావాల్సిన అన్నీ సిద్దం చేసుకుంటున్నారని వెలుగు చూసింది. అయితే మైసూరు మహారాజు యదువీర్ కు పోటీగా కాంగ్రెస్ ఎవరిని రంగంలోకి దించనుందనే దాన్ని బట్టి నియోజకవర్గంలో తదుపరి రాజకీయ పోరు చిత్రం మారనుంది.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?











Click it and Unblock the Notifications