పురందేశ్వరి కీలక బాధ్యతలు, బండికి ప్రమోషన్- సమూల ప్రక్షాళన..కొత్త టీం సిద్దం..!!
ప్రధాని మోదీ కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. మోదీ 4.0 లో భాగంగా ప్రభుత్వం.. పార్టీలో సమూల ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం లోగా నిర్ణయాలు అమలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలకు కొత్త బాధ్యతలు దక్కే అవకాశం కనిపిస్తోంది. పార్టీ- మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే విధంగా కసరత్తు కొనసాగుతోంది.
బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటు పై కీలక మంత్రాంగం కొనసాగుతోంది. తాజాగా పార్టీ చీఫ్ నితిన్ నబీన్.. తాజాగా అమిత్ షా నివాసంలో సుమారు మూడు గంటల పాటు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ముగ్గురు నేతల మధ్య జరిగిన చర్చల్లో కొత్త కేంద్ర బృందం రూపకల్పనతో పాటు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.

నితిన్ నబిన్ నేతృత్వంలోని కొత్ టీంలో అనుభవజ్ఞులైన సీనియర్ నేతలతో పాటు యువ నాయకులకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్న కొందరు నేతలను సంస్థాగత బాధ్యతల కోసం తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే అవకాశాలపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత
కొందరు మంత్రులకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అంశం పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే విధంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ, జాతీయ కౌన్సిల్ లోనూ కీలక మార్పులు జరగనున్నాయి. కీలక పదవుల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించటం ఖాయంగా కనిపిస్తోంది.
అదే సమయంలో బండి సంజయ్ -కిషన్ రెడ్డిలను మంత్రులుగా కొనసాగిస్తూనే పార్టీ బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇక.. ఏపీ నుంచి పురందేశ్వరికి కొత్త జాతీయ కార్య వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి విజయేంద్ర, తమిళ నాడు నుంచి మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ లకు జాతీయ టీంలో కొత్త బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. కొత్త కార్యవర్గం పై వచ్చే వారం అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications