ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా - మోదీ మార్క్ ఎంపిక..!!
Delhi Assembly Election 2025 Results: ఢిల్లీలో బీజేపీ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 27 ఏళ్ల నిరీక్షణ తరువాత ఢిల్లీ పీఠం దక్కించుకుంటోంది. స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. 13 ఏళ్ల ఆప్ ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికారు. పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపారు. దీంతో, ఇప్పుడు బీజేపీ నుంచి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు. ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మోదీ - షా ఎవరి వైపు సీఎంగా మొగ్గు చూపుతున్నారు.
కొత్త సీఎం ఎవరు
ఢిల్లీలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 36 సీట్ల మేజిక్ ఫిగర్ ను దాటేసింది. ఏకపక్షంగా బీజేపీ విజయం కనిపిస్తోంది. ఆప్ గట్టి పోటీ ఇచ్చినా అధికారం మాత్రం బీజేపీకి దక్కటం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ చిరునామా ఢిల్లీలో గల్లంతు అయింది. ఇక, బీజేపీ కొత్త సీఎం ఎవరనేది చర్చ మొదలైంది. అభ్యర్ధుల ఎంపిక సమయంలోనే బీజేపీ అధి నాయకత్వం కొత్త సీఎం.. డిప్యూటీ సీఎం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 27 ఏళ్ల తరువాత అధికారం దక్కించుకుంటున్న ఢిల్లీలో కీలక నేతకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిం చాలని మోదీ - షా నిర్ణయంగా సమాచారం.

సీఎం ఎంపిక వెనుక
బీజేపీ విజయంతో సీఎం రేసులో పలువురు నేతల పేర్లు ముందుకు వచ్చాయి. ఢిల్లీ బీజేపీ చీఫ్ గా ప్రస్తుతం వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నా రు. ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేశ్ బిధూడీ పేర్లు తెర పైకి వచ్చాయి. డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని ప్రచారం సమయంలో అమిత్ షా స్పష్టం చేసారు. అయితే, ఢిల్లీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్‌దేవా, ప్రవేశ్ వర్మ.. ఈ ముగ్గురిలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా చేసే అవకాశం ఉందని బీజేపీ నేతల సమా చారం. అయితే, హర్యానా - మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి ని ఖరారు చేసింది. పార్టీ సమావేశం.. ఆ తరువాతనే సీఎం ను ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది.
మహిళా సీఎం కు ఛాన్స్
ఇదే సమయంలో బీజేపీ నుంచి మహిళా సీఎం ఉంటారనే వాదన అనూహ్యంగా తెర మీదకు రావటం తో కొత్త సమీకరణాల పైన చర్చ జరుగుతోంది. 1993 లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మరోసారి మహిళకే సీఎం పగ్గాలు ఇవ్వాలని నిర్ణయిస్తే రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. అదే విధంగా ఎన్నికల ప్రచారంలోనూ మహిళా ఓటర్లే లక్ష్యంగా హామీలు గుప్పించారు. దీంతో, ఢిల్లీ సీఎంగా మోదీ - షా తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications