వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని దింపిన బిజెపి, అహ్మద్‌పటేల్‌కు చిక్కులే?

రాజ్యసభ ఎన్నికలను పురస్కరించుకొని గుజరాత్‌ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్‌లు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. బిజెపి మూడో అభ్యర్థిని కూడ రంగంలోకి దించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: రాజ్యసభ ఎన్నికలను పురస్కరించుకొని గుజరాత్‌ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్‌లు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. బిజెపి మూడో అభ్యర్థిని కూడ రంగంలోకి దించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌పటేల్ ఎన్నికపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్‌ను ఆ పార్టీ మూడో అభ్యర్థిగా బరిలోకి దించింది.

త్వరలో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి,. అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న శంకర్‌సింగ్ వాఘేలా ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన బాటలోనే కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది.

 BJP fields third candidate to corner Ahmed Patel in Rajya Sabha bout

బిజెపి మూడో అభ్యర్థిని రంగంలోకి దించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షాక్ గురిచేసింది.అయితే మూడో అభ్యర్థిని బిజెపి రంగంలోకి దించడంతో సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడం ఇబ్బందిగానే మారింది.

బిజెపి వ్యూహత్మకంగానే మూడో అభ్యర్థిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటట్లోనే బలవంత్‌సిన్హా రాజ్‌పుట్‌ను బిజెపి మూడో అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే రాజ్‌పుట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లలో చీలిక తెచ్చే అవకాశం ఉన్నందున మూడో అభ్యర్థి కూడ విజయం సాధించే అవకాశాలున్నాయని ఆ పార్టీ అంచనాతో ఉంది. శంకర్‌సింగ్ వాఘేలాకు ఆయన చాలా దగ్గరి బంధువు.

అయితే బిజెపి మాత్రం ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దింపింది. అయితే గుజరాత్ అసెంబ్లీలో ఉన్న బలం ప్రకారంగా ఆ పార్టీ సులభంగా ఇద్దరు అభ్యర్థులను గెలుచుకొంటోంది. క్రాస్ ఓటింగ్ ఇతరత్రా కారణాలతో మూడో అభ్యర్థిని కూడ గెలిపించుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది.

మూడు సీట్లకుగాను నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే మూడో వ్యక్తి విజయం అనేది ప్రాధాన్యత ఓట్ల ప్రకారంగానే సాధ్యమౌతోంది. అయితే అమిత్‌షా, స్మృతిఇరానీతో కలిసి మూడో అభ్యర్థిగా బలవంత్ సిన్హా నామినేషన్‌ను శుక్రవారం నాడు దాఖలు చేయనున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీకి గుజరాత్‌ నార్త్‌లోని బిజాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే కూడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అమిత్‌షా సమక్షంలో బిజెపిలో చేరారు. అయితే ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

గుజరాత్‌ అసెంబ్లీలో 182 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే రాజ్యసభకు అహ్మద్‌పటేల్ ఎన్నిక కావాలంటే కనీసం 47 ఓట్లు కావాల్సి ఉంటుంది. జెడియూతో పాటు ఎన్‌సిపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అహ్మద్‌పటేల్‌కు మద్దతిస్తామని హమీ ఇచ్చారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం అసెంబ్లీలో 54. అయితే శంకర్‌సింగ్ వాఘేలాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పార్టీ వీడిన వారంతా రాజ్యసభ ఎన్నికల్లో పదిమంది ఎమ్మెల్యేల ఓపెన్ బ్యాలెట్ నిర్వహించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకొందని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు. క్రాస్ ఓటింగ్ జరుగుతోందనే భయం ఆ పార్టీని బెంబేలెత్తిస్తోందని గుజరాత్ మంత్రి ప్రదీప్‌సిన్హ్ జడేజా అబిప్రాయపడ్డారు.

English summary
The BJP on Thursday announced a third candidate for the Rajya Sabha elections from Gujarat. The decision has sent shock waves across the Congress high command as the move has the potential to jeopardise Sonia Gandhi’s political secretary Ahmed Patel’s battle for survival in the Upper House polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X