బీజేపీ హైకమాండ్ త్వరలో ఇద్దరి పేర్లు ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూపులు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా బీజేపీ ప్రతిపక్ష నేత పేరును ఇంత వరకు ప్రకటించలేదు. ప్రతిపక్ష నాయకుడి పదవి కూడా బీజేపీ అమ్ముకుంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో కాంగ్రెస్ నేతల బీజేపీ హైకమాండ్ ను అవహేళనలు చేస్తున్నారు.
కర్ణాటక బీజేపీ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సిన బాధ్యత కూడా బీజేపీ హైకమాండ్‌దే అని అందరికి తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న మాజీ మంత్రి సీటీ రవి పేరు, కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నేతగా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ పేర్లు బీజేపీ హైకమాండ్ ముందు చర్చకు వచ్చాయని తెలిసింది.

ఈ ఇద్దరి పేర్లను బీజేపీ హైకమాండ్ నాయకులు పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కుల సమీకరణాల లెక్కింపులో మళ్లీ నిమగ్నమైందరి తెలిసింది. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతలను లింగాయత్, ఒక్కలిగ కులాల నాయకులను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కర్ణాటటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కర్ణాటకలో బీజేపీ వాస్తవంగా నాయకత్వాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నళిన్‌కుమార్ కటీల్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. తాను తన పదవికి రాజీనామా చేస్తానని నళిన్ కుమార్ కటీల్ కూడా ప్రకటించారు.

మాజీ మంత్రి వీ. సోమన్న అయితే ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలకు ఈ విషయంలో లేఖ పంపారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవి నాకు కావాలని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. కర్ణాటక మాజీ సీఎం బసవరాజక బోమ్మయ్ , మాజీ మంత్రి సునీల్ కుమార్ పేర్లు కూడా ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలనే ప్రతిపాధనలు బీజేపీ హైకమాండ్ ముందకు వెళ్లాయి.

-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications