Rahul Gandhi : యూఎస్, యూరప్ జోక్యం కోరిన రాహుల్-భారత్ ను అవమానించారన్న బీజేపీ..

బ్రిటన్ పార్లమెంట్ లో నిన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్ర దుమారం రేపాయి. వీటిపై బీజేపీ ఇవాళ ఎదురుదాడికి దిగింది.

కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా భారత్ లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు పార్లమెంటులో ఆయన్ను కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానంగా ఇక్కడ పరిస్దితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా లేదంటూ ఆయన పలు ఉదాహరణలు కూడా ప్రస్తావించారు. అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే భారత్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన యూరప్, యూఎస్ మౌనంగా ఉండటాన్నీప్రశ్నించారు.

భారత్ లో తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. దేశంలో ప్రజాస్వామ్యం రద్దైందని వ్యాఖ్యానించారు. దీనిపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు విదేశీ గడ్డపై భారత్ ను అవమానించడమేనంటూ కాషాయ పార్టీ నేతలు విమర్శలకు దిగారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో భారత ప్రజాస్వామ్యం, రాజకీయాలు, పార్లమెంటు, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడారాని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
రాహుల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ ఛీఫ్ సోనియాగాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

bjp hits out at rahul gandhi for seeking europe and US intervention in indian democracy

భారత్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యూరప్, అమెరికా జోక్యం చేసుకోవాలని రాహుల్ కోరుతున్నారని, అది ఏ ప్రభుత్వమైనా మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీనిపై ఖర్గే, సోనియా స్పందించాలన్నారు. నిన్న రాహుల్ చేసిన వ్యాఖ్యలతో భారత్ లో ప్రజాస్వామ్యంపై విదేశాలు సందేహాలు వ్యక్తం చేసే పరిస్ధితులు వచ్చాయని బీజేపీ మండిపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+