Jharkhand Polls: జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ పై బీజేపీ నినాదం ఇదే-ఏంటీ "మిలా క్యా "

జార్ఖండ్ అసెంబ్లీకి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష బీజేపీ సిద్దమవుతోంది. ఐదేళ్లుగా జార్ఖండ్ ను పాలిస్తున్న యూపీఏ ప్రభుత్వం తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈసారి ఎలాగైనా అధికారం అందుకోవాలని తపిస్తున్న బీజేపీ..మిలా క్యా (దొరికిందా) పేరుతో కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది. సీఎం హేమంత్ సోరెన్ టార్గెట్ గా కొంతకాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో అంతిమంగా ఈ కీలక నినాదం అందుకుంది.

హేమంత్ సోరెన్ సర్కార్ అధికారంలోకి రావడానికి భారీ ఎత్తున సంక్షేమ పథకాల హామీలు ఇచ్చారు. కానీ వాటిలో చాలా మటుకు అమలు చేయలేదని ఆరోపిస్తున్న బీజేపీ అదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకోసం సంక్షేమ పథకాలు అందాయా లేదా అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అందుకే మిలా క్యా నినాదాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సోరెన్ సర్కార్ విఫలమైందనే అంశం ప్రస్తావిస్తోంది.

bjp launches mila kya campaign against hemanth soren for jharkhand assembly polls

జార్ఖండ్ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈసారి కూడా ఇండియా కూటమితో పాటు ఎన్డీఏ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం పలు హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆలోపు హేమంత్ సోరెన్ వైఫల్యాలతో పాటు హామీలు నిలబెట్టుకోకపోవడాన్ని కూడా ప్రచారాస్త్రంగా మల్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే హామీల వారీగా అమలును జనంలోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్దాయి ప్రణాళికను సిద్దం చేసుకుంది. త్వరలో దీన్ని అమలు చేయబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+