పవన్ మేజిక్ కలిసొచ్చిందా - ఫలితాలు తేల్చిందేంటి..!!
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ కూటమి అధికారం చేపట్టటం ఖాయమైంది. అనూహ్యంగా 220 సీట్ల వరకు ఆధిక్యత ప్రదర్శిస్తూ.. కాంగ్రెస్ కూటమికి భారీ షాక్ ఇస్తోంది. ఇదే సమయంలో బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాల పైన ఆసక్తి కనిపిస్తోంది. పవన్ ప్రచారం చేసిన నియోజక వర్గాల్లో బీజేపీకి ఆధిక్యత కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉండటంతో బీజేపీ నేతలు ఆ ప్రాంతాల్లో ఫలితాల సరళి పైన లెక్కలు మొదలు పెట్టారు.
బీజేపీకే పట్టం
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మహాయుతికే అధికారం ఖాయమైంది. కొత్తగా బీజేపీ నాయకత్వంలోని కూటమి కొలువు తీరనుంది. మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా బీజేపీ కూటమి కే మద్దతు ప్రకటించారు. అనూహ్యంగా బీజేపీ 120 సీట్ల వరకు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయాల్సిన 145 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం వేళ బీజేపీ ఏ ఒక్క అవకాశం వదులుకోలేదు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించింది.

పవన్ ప్రచారంతో
పవన్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పూణే, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ లలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాగా, పవన్ ప్రచారం చేసిన పూణే, బల్లార్ పూర్, షోలాపూర్ లో బీజేపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. డెత్లూర్, లాతూర్ లలో మాత్రం ఇప్పటి వరకు ఫలితాల సరళి హోరాహోరీగానే కనిపిస్తోంది. అయితే, బీజేపీకి మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు కనిపించింది. ఎన్నికల సమయంలో మహాయుతి ఇచ్చిన హామీలు ప్రజల్లోకి వెళ్లాయి. మోదీతో సహా బీజేపీ ముఖ్య నేతలు ఎంవీఏ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కూటమి విజయం సాధించగా.. ప్రత్యేకించి పవన్ పోటీ చేసిన ప్రాంతాల పైన చర్చ నడుస్తోంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీకి ఆధిక్యం..!#PawanKalyan #Janasena #MaharashtraElection2024 #ElectionResults #MaharashtraAssemblyElections2024#MaharashtraElectionResults #ElectionCommissionOfIndia #Oneindiatelugu pic.twitter.com/ZIvTavaAUD
— oneindiatelugu (@oneindiatelugu) November 23, 2024
బీజేపీ నేతల ఆరా
పవన్ కల్యాణ్ తన ప్రచారంలో ప్రధానంగా మహారాష్ట్ర గడ్డ ఛత్రపతి శివాజీ నేలగా అభివర్ణించారు. మరాఠా ప్రజల భవిష్యత్ కావాలంటే బీజేపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. తనకు బాలా సాహెబ్ థాక్రే పైన ఉన్న అభిమానం చాటుకున్నారు. శివసేన, జనసేన మధ్య సారూప్యత వివరించారు. ఎంఐఎం పైన విమర్శలు చేసారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేసారు. ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాల సరళిని జనసైనికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అటు బీజేపీ నాయకత్వం సైతం పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో వస్తున్న ఫలితాల పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, పూర్తి ఫలితాలు వచ్చిన తరువాత పవన్ ప్రభావం ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications