బీజేపీ నేత కుమారుడు పోటుగాడు (వీడియో)
రాయ్ పూర్: చత్తీస్ ఘడ్ కు చెందిన ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. తన స్నేహితులతో కలిసి బైక్ లో వెలుతున్న యువకులను బురద రోడ్డులో పొర్లించి పొర్లించి కొట్టారు. చివరికి అతను చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు.
చత్తిస్ ఘడ్ లో గతంలో కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన మాంథురాం ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నాడు. ఇతని కుమారుడు నన్ను పవార్. ఇటీవల నన్ను పవార్ తన ఎస్ యూవీ కారులో స్నేహితులతో కలిసి ఖేర్ కట్టా ప్రాంతంలో ప్రయాణించాడు.
ముందు వెలుతున్న బైక్ లను క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. అది వీలుకాకపోవడంతో నన్ను పవార్ కు కోపం వచ్చింది. వెంటనే బైక్ లలో వెలుతున్న వారిని అడ్డుకుని కర్రలతో చితకబాదేశారు.
బురదరోడ్డులో పొర్లించి పొర్లించి కొట్టారు. అదే సమయంలో వీడియో చిత్రీకరించారు. స్థానికులు జోక్యం చేసుకుని యువకులను రక్షించారు. తాను చేసిన ఘనకార్యాన్ని నన్ను పవార్ మాతో పెట్టుకోకు అంటూ సోషల్ మీడియాలో పెట్టాడు. వీడియో గుర్తించిన పోలీసులు నన్ను పవార్ అతని స్నేహితుల మీద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications