సిద్దరామయ్యకు చెక్ పెడుతున్న మోదీ, టాప్ లీడర్ ఎంట్రీ, కులం ఓట్లతో సిద్దూకు షాక్ !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల సందర్బంగా రోజుకొక హాట్ టాపిక్ తెరమీదకు వస్తోంది. రాజకీయ ప్రత్యర్థి, మాజీ సీఎం సిద్దరామయ్యను ఆయన సొంత జిల్లాలో ఓడించి ఆయనకు మరోసారి ఓటమి రుచి చూపించాలని మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సిద్దరామయ్య మీద పోటీకి బీజేపీ మంత్రిని రంగంలోకి దింపుతున్నారు.
బెంగళూరులోని గోవిందరాజనగరలో తిరుగులేని నాయకుడిగా, వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వీ. సోమణ్ణ ఒకేఒక్కసారి ఓడిపోయారు. అయినా వీ. సోమణ్ణను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. బెంగళూరులోని పవర్ ఫుల్ మంత్రుల్లో వీ. సోమణ్ణ ఒకరు. బీఎస్. యడియూరప్పకు ప్రధాన అనుచరుడిగా, లింగాయత్ సామాజిక వర్గంలో మంచి నాయుడిగా సోమణ్ణకు మంచి పేరు ఉంది.
రంగంలోకి సిద్దూ కుమారుడు: మైసూరు జిల్లాలోని వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి మాజీ సీఎం సిద్దరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరుణా నియోజక వర్గంలో సిద్దరామయ్య తరపున ఆయన కుమారుడు. సిట్టింగ్ ఎమ్మెల్యే యతీంద్ర ఇప్పటికే అక్కడ ప్రచారం ముమ్మరం చేశారు. సిద్దరామయ్య మీద బలమైన వ్యక్తిని పోటీలో పెడుతామని ఇప్పటికే బీజేపీ చెప్పింది.

మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర వరుణా నియోజక వర్గంలో సిద్దరామయ్య మీద పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తన కొడుకు విజయేంద్ర సిద్దరామయ్య మీద పోటీ చెయ్యడని యడీయూరప్ప ఇప్పటికే తేల్చి చెప్పార. సిద్దరామయ్యను ఓడించే సత్తా ఎవరికి ఉంది అని బీజేపీ హైకమాండ్ జల్లెడ పట్టింది.
లింగాయత్ ఓట్లు డిసైడ్ చేస్తాయి: వరుణా నియోజక వర్గంలో లింగాయత్ కులం ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది. లింగాయత్ వర్గానికి చెందిన వీ, సోమణ్ణను వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయ్యిందని తెలిసింది. అయితే బీజేపీ హైకమాండ్ ఎక్కడ నుంచి పోటీ చెయ్యమంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని వీ. సోమణ్ణ అంటున్నారు.
బెంగళూరు టూ వరుణా: బెంగళూరులోని గోవిందరాజ నగర నుంచి పోటీ చేస్తారా ?, వరుణా నుంచి పోటీ చేస్తారా ? అనే విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. సిద్దరామయ్యను ఆయన సొంత జిల్లా మైసూరులో మరోసారి ఓడించాలని (గతంలో చాముండిలో సిద్దరామయ్య ఓడిపోయారు) బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications