మోదీకి చాన్స్ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, బాంబు పేల్చిన ఎంపీ, బీజేపీ ఏం చెప్పిందంటే ?
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పదవ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించారు. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటక బీజేపీ ఎంపీ మరో వివాదాన్ని సృష్టించి సైలెంట్ అయిపోయారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో దూమరం రేపింది. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు.
కేంద్రంలో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి మళ్లీ కేంద్రంలోకి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ రాజ్యాంగం సవరణపై ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన ప్రకటనలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని, ఆయన వ్యాఖ్యలను మా పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని, ఆయన మాటలను మేము సమర్థించడం లేదని స్పష్టం చేసింది.

దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న మా నిబద్ధతను బీజేపీ పునరుద్ఘాటిస్తోందని కర్ణాటక బీజేపీ స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమికంగా రాజ్యాంగంలో అనవసరమైన విషయాలను నింపిందని, ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు ఉద్దేశించిన చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా రాజ్యాంగాన్ని వక్రీకరించిందని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే ఆరోపించారు.

ఇవన్నీ మార్చాలంటే బీజేపీకి ఇప్పుడున్న మెజారిటీతో అది సాధ్యం కాదని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించాలంటే బీజేపీ 20కి పైగా రాష్ట్రాలను గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావిస్తూ లోక్‌సభలో, ఆపై రాజ్యసభలో నిరంతర ప్రయత్నాల ద్వారా ఆమోదించబడిందని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే అన్నారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించకపోవడంతో అది అమలు కాలేదని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు. బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైన పార్టీ అని అనంతకుమార్ హెగ్డే మాటలు వింటే అర్థం అవుతోందని డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని సవరించడానికి సిద్దం అవుతోందని మరోసారి వెలుగు చూసిందని, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎంపీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చెయ్యడానికి సిద్దం అయ్యారని డీకే శివకుమార్ ఆరోపించారు. 2017లో అప్పటి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేసిన అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించి వివాదం సృష్టించారు. ఆ తర్వాత లోక్‌సభలో అనంతకుమార్ హెగ్డే క్షమాపణలు చెప్పి తన ప్రకటనను వక్రీకరించారని రివర్స్ గేర్ వేశారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications