కేంద్రమంత్రి హల్‌చల్.. పోలింగ్‌బూత్‌లో రచ్చ.. FIR నమోదుకు ఈసీ ఆదేశం
కోల్‌కతా : కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రియోపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలంటూ రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. పశ్చిమబెంగాల్ లోని అసన్‌సోల్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బాబుల్ సుప్రియో.. సోమవారం జరిగిన పోలింగ్ సందర్భంగా హల్‌చల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బొనాబనీ ప్రాంతంలోని 199 పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లారు. అయితే అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్ ను బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాబుల్ సుప్రియో పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి బయటకు రావడంతో ఈసీ అధికారులు ఆయనపై గరమయ్యారు. ఆయన తమను బెదిరించాడంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ధృవీకరించడంతో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీచేశారు.












Click it and Unblock the Notifications