Lok Sabha election 2024: బీజేపీకి షాకిచ్చిన వరుణ్ గాంధీ-సోదరి ప్రియాంకపై పోటీకి నో..!
గత లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని పిలిభిత్ సీటు నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన గాంధీ కుటుంబ వారసుడు వరుణ్ గాంధీకి ఈసారి మాత్రం ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. కొంతకాలంగా బీజేపీ విధానాలపై బహిరంగానే విమర్శలు చేస్తున్న వరుణ్ కు ఈసారి టికెట్ ఇచ్చేందుుక కాషాయ పార్టీ ఆసక్తి చూపలేదు. అయితే వరుణ్ కూడా దీనిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ ను కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్ బరేలీ సీటు నుంచి బరిలోకి దించాలని బీజేపీ భావించింది.
2004 నుంచి రాయ్ బరేలీలో వరుసా గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియ గాంధీ ఈసారి మాత్రం రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో రాయ్ బరేలీలో ఎవరు పోటీ చేస్తున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో సోనియా కుమార్తె, ప్రస్తుతం యూపీ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న ప్రియాంక గాంధీ వాద్రాను రాయ్ బరేలీ నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ప్రియాంకపై పోటీగా వరుణ్ గాంధీని పోటీ చేయాలని బీజేపీ సూచించింది.

అయితే సోదరి ప్రియాంకపై పోటీ చేసేందుకు వరుణ్ గాంధీ నో చెప్పేశారు. ఈ మేరకు బీజేపీ ఆఫర్ ను వరుణ్ గాంధీ తిరస్కరించారు. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ కుమారుడు అయిన వరుణ్ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీ పేరుకే బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. కానీ ఎప్పుడూ యాక్టివ్ రాజకీయాలు చేయలేదు. రాజీవ్ గాంధీ సతీమణి అయిన సోనియా గాంధీతో విభేదాల కారణంగా వారు గాంధీ కుటుంబానికీ, రాజీవ్ పిల్లలకూ దూరంగా ఉన్నారు. అయితే ఈ విభేదాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన బీజేపీకి వరుణ్ తాజా నిర్ణయం షాకిచ్చింది.












Click it and Unblock the Notifications