వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి తలనొప్పిగా మారిన వరుణ్ గాంధీ.. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ కొరకరాని కొయ్యగా మారారు. మోదీ పాలనపై ఆయన చేస్తున్న విమర్శలు ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించారు. బ్యాంకులను మోసం చేసిన ఆర్థిక నేరగాళ్లపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ వరుణ గాంధీ చేస్తున్న విమర్శలు బీజేపీ తలనొప్పిగా మారారు.

 ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై ఆగ్రహం

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై ఆగ్రహం

తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై వరుణ్ గాంధీ ఆరోపణాస్త్రాలు సందించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఎందుకు ప్రైవేటుపరం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రక్రియతో లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు అందకారమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బలవంతపు పదవి విరమణ

బలవంతపు పదవి విరమణ

కేవలం బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణతోనే దాదాపు అయిదు లక్షల మంది ఉద్యోగులు బలవంతంగా పదవి విరమణ చేయాల్సి వస్తుందని వరణ్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా వారు నిరుద్యోగులుగా మారతారు. లక్షలాది కుటుంబాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపే 'ప్రజా సంక్షేమ ప్రభుత్వం' పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించదంటూ ట్విట్ చేశారు.

Recommended Video

Uttar Pradesh Elections 2022:PM Modi చరిష్మా గట్టెక్కించేనా ? | Yogi Adityanath | Oneindia Telugu
రైల్వే ఆస్తులు లీజుకు...

రైల్వే ఆస్తులు లీజుకు...


ప్రతిపక్షాలు సైతం బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. రైల్వే రంగంలో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించే విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీనిపై రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్ కూడా లోక్‌స‌భ‌లో వివరణ ఇచ్చారు. రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. కానీ రైల్వేకు చెందిన భూములు, ఆస్తులను స్టేషన్ అభివృద్ధి కోసం ప్రైవేటు వ్యక్తులకు లీజుగా బదిలీ చేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. తాజాగా బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ.. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది..

English summary
BJP MP Varun Gandhi Says'Public welfare government' does not promote capitalism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X