రాహుల్ గాంధీలా మాట్లాడి మిమిక్రీ చేసిన అమిత్ షా, వీడియో వైరల్, ఏం ట్యాలెంట్!

Recommended Video

    రాహుల్ గాంధీలా మాట్లాడి మిమిక్రీ చేసిన అమిత్ షా, వీడియో వైరల్!

    బీదర్/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరం చేస్తూ ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలా మాట్లాడుతారో అలాగే మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కార్యకర్తలను నవ్వుల్లో ముంచెత్తారు.

    ఉత్తర కర్ణాటక

    ఉత్తర కర్ణాటక

    కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు ఉత్తర కర్ణాటకలో ముమ్మరంగా ప్రచారం చేశారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

    లోకల్ బాషలో మూడు ముక్కలు

    లోకల్ బాషలో మూడు ముక్కలు

    కర్ణాటకలో ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వీరిద్దరూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో రెండు మూడు ముక్కలు కన్నడ బాషలో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు.

    అమిత్ షా మిమిక్రీ

    బీదర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన నవశక్తి సమావేశ కార్యక్రమంలో అమిత్ షా రాహుల్ గాంధీ ఎలా మాట్లాడుతున్నారో అలాగే మిమిక్రీ చేస్తూ మాట్లాడటంతో బీజేపీ కార్యకర్తలు నవ్వు ఆపుకోలేకపోయారు. రాహుల్ గాంధీలాగా అమిత్ షా మిమిక్రీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమిత్ షా మిమిక్రీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    వ్యక్తిగత విమర్శలు

    వ్యక్తిగత విమర్శలు

    ఉత్తర కర్ణాటకలో ప్రచారం చేసిన అమిత్ షా, రాహుల్ గాంధీ ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. మహాదాయి నదీ నీటి పంపిణి వివాదం, లింగాయత్ ధర్మం తదితర అంశాలు అమిత్ షా, రాహుల్ గాంధీ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+