బీజేపీ చీఫ్ జేపీ నడ్డా భార్య కారు గోవింద, ఇంటి ముందే చేతివాటం, సీసీటీవీ కెమెరాల్లో ?

దేశం మొత్తం లోక్ సభ ఎన్నికలతో వేడెక్కింది. దేశంలోని అన్ని లోక్ సభ నియోజక వర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల నాయకులు, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో చాలా బిజీగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా పోలీసులు తీరకలేకుండా ఫుల్ బిజీగా ఉన్నారు.

సున్నితమైన నియోజక వర్గాల్లో మిలటరీ సిబ్బంది రంగంలోకి దిగాయి. పోలీసులు 24 గంటల పాటు విధుల్లో ఉండే పరిస్థితి ఎదురైయ్యింది. ఎన్నికల నియమాలు అమల్లోకి రావడంతో పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు నాకాబంధీ నిర్వహిస్తు అక్రమంగా నగదు, బంగారు, విలువైన వస్తులు తరలించకుండా వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓటర్లకు పంచిపెట్టడానికి తీసుకెలుతున్న వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

BJP national president JP Nadda s wife s car was stolen in Delhi

ఇక లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించే విషయంలో బీజేపీ నాయకుతో చర్చలు జరుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీరికలేకుండా గడుపుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఛీఫ్ జేపీ నడ్డాకు ఢిల్లీ దొంగలు ఊహించని షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి చెందిన ఖరీదైన కారును చోరీ చేసిన దొంగలు ఇంత వరకు చిక్కకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి టయోటా ఫార్చునర్ కారు ఉపయోగిస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సతీమణికి చెందిన టయోట ఫార్చునర్ కారు చోరీ అయ్యిందని ప్రముఖ మీడియా సంస్థ ఎన్ డీ టీవీ వార్తలు ప్రసారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మార్చి 19వ తేదీన మద్యాహ్నం ఢిల్లీలోని గోవిందపురం ప్రాంతంలో జేపీ నడ్డా భార్యకు చెందిన టయోటా ఫార్చునర్ కారు చోరీ అయ్యింది ఎన్ డీ టీవీ వార్తలు ప్రసారం చేసింది.

అయితే మార్చి 19వ తేదీన చోరీ అయిన కారు విషయం గురించి మార్చి 25వ తేదీ సోమవారం ఉదయం మ్యాటర్ బయటకు వచ్చింది. జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్ గోవిందపురంలోని అతని ఇంటి దగ్గర కారు పార్క్ చేసి తరువాత భోజనం చెయ్యడానికి వెళ్లాడు. భోజనం చేసిన తరువాత బయటకు వచ్చి చూడగా కారు కనపడలేదదని జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు గోవిందపురంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. కారును చోరీ చేసిన నిందితులు గోవిందపురం నుంచి గురుగ్రామ్ వైపు వెలుతున్న క్లిప్పింగ్స్ ను పరిశీలించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. జేపీ నడ్డా సతీమణి ఉపయోగిస్తున్న టయోటా ఫార్చునర్ కారు హిమాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ అయ్యిందని, దాని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. జేపీ నడ్డా కారు చోరీ అయ్యి ఆరు రోజులు అవుతున్నా ఆ కారు ఇంత వరకు చిక్కలేదని, పోలీసులు ఆ కారు కోసం గాలిస్తున్నారని సోమవారం ఎన్ డీ టీవీ వార్తలు ప్రసారం చేసింది.

BJP national president JP Nadda s wife s car was stolen in Delhi

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టుతో పాటు పలు కేసుల్లో ఢిల్లీ పోలీసులు ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సభ్యుల కారు చోరీ కావడంతో ఢిల్లీ పోలీసులు తీరికలేకుండా పని చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద జేపీ నడ్డా సతీమణి ఉపయోగిస్తున్న టయోటా ఫార్చునర్ కారు చోరీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+