సిఎం పోస్ట్‌తో కుట్ర, 20కోట్ల ఆఫర్: బిజెపిపై కేజ్రీ ఎమ్మెల్యే

ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చాల్సిందిగా కోరుతూ మోడీకి సన్నిహితుడైన ఒక వ్యక్తి తనకు రూ.20 కోట్లు ఇవ్వజూపారని, ఈ పని చేస్తే తననే ముఖ్యమంత్రిని చేస్తానని కూడా హామీ ఇచ్చారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మదన్ లాల్ సోమవారం విలేఖర్ల సమావేశంలో ఆరోపించారు.
దాదాపు పది పన్నెండు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు తనను కలిశారని, వీరిలో ఒకరు తన పేరు సంజయ్ సింగ్ అని, మోడీకి అత్యంత సన్నిహితుడినని చెప్పాడని, ఎఎపికి చెందిన దాదాపు పదిమంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టాల్సిందిగా మోడీ తనతో చెప్పమన్నారని, అలా చేయగలిగితే తనను ముఖ్యమంత్రిని చేయడంతో పాటు తన మంత్రి వర్గంలో ఒక్కో సభ్యుడికి 10 కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తామని సంజయ్ సింగ్ చెప్పారని మదన్ ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలకు ఆయన ఎటువంటి సాక్ష్యాధారాలు చూపలేదు. ఇదిలావుంటే, డిసెంబర్ 7వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని మరో వ్యక్తి తనకు ఫోన్ చేసి ఒక ప్రముఖ వ్యక్తి తనతో మాట్లాడాలని భావిస్తున్నట్టు చెప్పాడని, ఆ వ్యక్తి ఎవరని ప్రశ్నించగా, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ అని సమాధానం వచ్చింద మదన్ లాల్ తెలిపారు.
మరోవైపు కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించిన జెడి(యు) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రాంబీర్ సోమవారం వెనక్కి తగ్గారు. కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం వారు తగ్గారు. మరోవైపు కాంగ్రెసు పైన పోరాటానికి ఎఎపి సిద్ధమైంది. 2008లో అనధికార కాలనీలను క్రమబద్ధీకరించడంలో అక్రమాలకు తావిచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సిఎం షీలా దీక్షిత్ పైన చర్యలు తీసుోకవాలని కోరుతూ కేజ్రీ ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాసింది.












Click it and Unblock the Notifications