వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ తగ్గలేదని జైల్లో, చేతులు కలిపాక బెయిల్: బిజెపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nirmala Sitaraman
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కాంగ్రెసుకు తలొగ్గక పోవడంతో పదహారు నెలలు జైలులో ఉంచారని, ఇప్పుడు చేతులు కలపడంతో విడుదల చేశారని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరోపించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల అక్రమ బంధం బెయిల్‌తో రుజువైందన్నారు.

ఎపిలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెసు అగ్రనేతలు మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. గుజరాత్‌లో జరిగిన అతిచిన్న సంఘనటను కూడా భూతద్దంలో చూపించి మాట్లాడుతూ ఎపి వంటి పెద్ద రాష్ట్రంలో అంత పెద్ద పరిణామం జరుగుతున్న వారు నోరు మెదపడం లేదన్నారు. కాంగ్రెసు పార్టీకి సిబిఐ అత్యంత విశ్వసనీయ మిత్రపక్షంగా మారిందని ఎద్దేవా చేశారు.

ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టే పార్టీలను మెడలు వంచడం ద్వారా కాంగ్రెసు అధికారాన్ని సిబిఐ కాపాడుతూ వచ్చిందన్నారు. కాంగ్రెసు వచ్చే లోకసభ ఎన్నికలకు కొత్త స్నేహాలను సంపాదించేందుకు సిబిఐను వాడుకోవడం ఇప్పుడు అత్యంత ఆందోళకర పరిణామం అన్నారు.

పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్‌కు హఠాత్తుగా బెయిల్ లభించడ వెనుక రాజకీయ దురుద్దేశ్యముందన్నారు. దర్యాఫ్తు పూర్తి కాకుండా బెయిల్ ఇవ్వడం కాంగ్రెసుకు లబ్ధి చేకూర్చేందుకే అన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెసుకు ఉపయోగపడతానని జగన్ చెప్పడం వల్లే ఆ పార్టీ బెయిల్ దారులు తెరిచిందన్నారు.

మంత్రుల మీద సిబిఐ ఉదారంగానే ఉందని, కొందర్ని జైల్లో ఉంచి, మరికొందరిని సాక్షులుగా ఉంచడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెసు అభీష్టం మేరకు ములాయం సింగ్ పైన ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సిబిఐ వెనక్కి తీసుకుందని, కాంగ్రెసు ఎస్పీల మధ్య ఒప్పందం మేరకు అలా జరిగిందన్నారు. అలాగే జగన్ పట్ల సిబిఐ వైఖరి మారడంతో బెయిల్ వచ్చిందన్నారు.

English summary

 Bharatiya Janata Party spokesperson Nirmala Sitaraman on Tuesday alleged YSRCP chief YS Jaganmohan Reddy got bail by the help of Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X