బాబుకు విరుగుడు: నేరుగా ఎపిలో బిజెపి నేతలు

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రచారానికి బిజెపి జాతీయ నాయకత్వం విరుగుడు కనిపెట్టినట్లే కనిపిస్తోంది. తాము ఎంత చేస్తున్నా తమకు తగిన ప్రయోజనం కలగకపోవడమే కాకుండా చంద్రబాబు చేస్తున్న ప్రచారం వల్ల నష్టం జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చిన బిజెపి నేతలు స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ఎపికి న్యాయం చేస్తున్న తీరును స్వయంగా కేంద్ర మంత్రులే వెళ్లి వివరించాలని బీజేపీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఏపీ బీజేపీ నాయకుల భేటీలో ఈ మేరకు చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తున్నా, ఎన్ని నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆ ప్రభావం కనిపించటం లేదని, కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందన్న తరహాలోనే ప్రచారం జరుగుతోందని రాష్ట్ర నాయకులు అమిత్‌షాకు వివరించారు. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

BJP plans to contain chandrababu campaign

కేంద్ర మంత్రులు వీలైనప్పుడల్లా ఏపీలో పర్యటించాలని, కేంద్రం ఏమేం చేస్తోందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవచ్చునని సూచించారు. ఇందుకు అమిత్‌షా కూడా అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జేపీ నడ్డాను ఏపీకి ఇన్‌చార్జిగా నియమించామని, తద్వారా రాష్ట్రానికి కావాల్సిన పనులను ఎప్పటికప్పుడు ఆయనకు చెప్పాలని, వాటిని పరిష్కరించే బాధ్యత ఆయన తీసుకుంటారని అమిత్‌షా వారికి వివరించినట్లు తెలిసింది.

విశాఖ నగరంలో ఉన్న దాదాపు 50 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్‌) వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జేపీ నడ్డా ఈ మధ్యనే అంగీకరించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 12వ తేదీన జేపీ నడ్డా ఏపీలో పర్యటించనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమితులైన తర్వాత నడ్డా ఏపీకి వెళ్లటం అదే తొలిసారి అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+